ప్రపంచ వ్యాప్తంగా సినిమా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా “అవతార్ పార్ట్ 2”. హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కేమరూన్ తెరకెక్కించిన భారీ విజువల్ వండర్ అవతార్ కి సీక్వెల్ గా అవతార్ 2 ని “అవతార్ ది వే ఆఫ్ వాటర్” అనే పేరిట తీసుకొస్తున్నారు.
అయితే ఇదిలా ఉండగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం జస్ట్ కొన్ని రోజులు కితం స్పెషల్ స్క్రీనింగ్ అంటూ చేసిన సందడితో ఒక్కసారిగా ప్రపంచ సినిమా అంతా ఈ సినిమా కోసమే మాట్లాడుకోగా లేటెస్ట్ గా ఈ సినిమా థియేట్రికల్ టీజర్ ట్రైలర్ ని సడెన్ గా రిలీజ్ చెయ్యగా దానికి భారీ స్థాయి రెస్పాన్స్ ఇప్పుడు 24 గంటల్లో వచ్చింది.
ఈ ట్రైలర్ కి గాను 24 గంటల్లో ప్రపంచ వ్యాప్తంగా 150 మిలియన్ వ్యూస్ వచ్చాయట. మరి ఇదొక సెన్సషనల్ రెస్పాన్స్ అని చెప్పాలి. ఇక ముందు రానున్న రోజుల్లో అయితే ఈ సినిమా సెన్సేషన్ ఎలా ఉంటుందో చూడాల్సిందే.