Home gossips సూర్య – బాలా సినిమా మొదలైంది !

సూర్య – బాలా సినిమా మొదలైంది !

243
0

తమిళ స్టార్ హీరో సూర్య తన తదుపరి సినిమాని స్టార్ డైరెక్ట‌ర్ బాలాతో చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమా షూటింగ్ ఈ రోజు కన్యాకుమారిలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. సూర్య 41వ సినిమాగా వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. సూర్య కోసం బాలా మంచి డెప్త్ ఉన్న కథ రాశాడని.. సూర్య కెరీర్ లోనే ఈ చిత్రం స్పెషల్ గా ఉండబోతుంది అని తెలుస్తోంది.

అయితే ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుందని వార్తలు వస్తున్నాయి. ఆమె యాక్టింగ్‌ కు ఇంప్రెస్ అయిన బాలా ఈ సినిమాలో హీరోయిన్‌ గా ఆమెను ఫైన‌ల్ చేశారని తెలుస్తోంది. ఒకవేళ ఈ వార్త నిజం అయితే.. కృతి శెట్టి కెరీర్ మరో మెట్టు ఎక్కినట్టే. అలాగే టాలెంటెడ్ నటి ఐశ్వర్య రాజేష్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తుంది. ఐశ్వర్య రాజేష్ కి తెలుగులో మెయిన్ హీరోయిన్ పాత్రలు రాకపోయినా తమిళ మేకర్స్ మాత్రం ఆమెకు మంచి పాత్రలు ఇస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here