ముక్కు అవినాశ్ పెళ్లిలో యాంక‌ర్ శ్రీ‌ముఖికి చేదు అనుభ‌వం!

  156
  0
  Srimukhi

  స్టార్ యాంక‌ర్ బ్యూటీ శ్రీ‌ముఖి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. యాంక‌ర్‌గా అప్పుడ‌ప్పుడు సినిమాల్లో మెప్పిస్తూ బుల్లితెర రాముల‌మ్మ‌గా పేరు సంపాదించుకున్న శ్రీముఖి.. బిగ్‌బాస్ సీజ‌న్ 3లోనూ పాల్గొన‌డ‌మే కాకుండా, ర‌న్న‌ర‌ప్‌గా నిలిచి అందరి దృష్టిని ఆక‌ర్షించింది. అక్క‌డి నుండి బుల్లితెర‌పై త‌న స్పీడును మ‌రింతగా పెంచింది. అయితే ఆమెకు రీసెంట్‌గా జగిత్యాల‌తో న‌డిరోడ్డుపై ఊహించని ప‌రిణామంతో షాక్ తగిలినట్లు అయ్యింది. ఇంత‌కీ రాములమ్మ‌కు అంత ఇబ్బంది క‌లిగించే విష‌యం ఏం జ‌రిగింద‌నే వివ‌రాల్లోకెళ్తే..

  బిగ్‌బాస్ సీజ‌న్‌3లో శ్రీముఖితో పాటు ముక్కు అవినాష్ కూడా ఓ కంటెస్టెంట్‌గా పాల్గొన్న సంగ‌తి తెలిసిందే. అవినాష్‌తో శ్రీముఖికి మంచి ఫ్రెండ్ షిప్ ఏర్ప‌డింది. రీసెంట్‌గా జ‌రిగిన అవినాష్ పెళ్లిలోనూ శ్రీముఖి ఇంట్లో మ‌నిషిలాగా క‌లిసిపోయి తెగ హ‌ల్‌చ‌ల్ చేసింది. పెళ్లి త‌ర్వాత అవినాష్ పెళ్లి వేడుక విశేషాల‌ను రిసెప్ష‌న్ వేడుక విశేషాల‌ను త‌న యూట్యూబ్ ఛానెల్ ద్వారా వ్లాగ్ రూపంలో అంద‌రికీ తెలియ‌జేసింది శ్రీముఖి. ఇదంతా బాగానే ఉంది. అయితే ఇక్క‌డే అస‌లు షాక్ రాములమ్మ‌కు త‌గిలింది.

  అదేంటంటే అవినాష్ సొంత ఊరు జగిత్యాల‌. అక్క‌డే శ్రీముఖి సంద‌డి చేసేట‌ప్పుడు రోడ్డుపై వెళ్లే ఒక వ్య‌క్తిని ఆపి త‌నెవ‌రో క‌నిపెట్ట‌మ‌ని అడిగింది. అయితే, స‌ద‌రు వ్య‌క్తి శ్రీముఖి ఎవ‌రో త‌న‌కు తెలియ‌దంటూ ఆమెకు షాక్ ఇచ్చాడు. అవినాష్ మాత్రం తెలుసున‌ని, అయితే అది కూడా టీవీ న‌టుడిగా కాద‌ని, సొంత ఊరు వ్య‌క్తిగా తెలుసున‌ని ఆ వ్య‌క్తి చెప్ప‌డం కొస మెరుపు. ఈ అనుకోని షాక్‌తో రాములమ్మ‌కు మైండ్ బ్లాంక్ అయిపోయింద‌ట‌. త‌ను టీవీల్లో ఎంత సంద‌డి చేసినా, సెల‌బ్రిటీల బ‌య‌ట తిరిగినా కూడా.. తానెవ‌రో తెలియ‌ని జ‌నాలు ఉంటార‌ని శ్రీముఖికి అర్థ‌మైంది.

  ఇంత కాలం తానొక భ్ర‌మ‌లో ఉన్నట్లు శ్రీముఖికి అర్థ‌మై నిట్టూర్చ‌డం త‌ప్ప ఏమీ చేయ‌లేక‌పోయింది. బిగ్‌బాస్ సీజ‌న్‌3లో సింగ‌ర్ రాహుల్ సిప్లిగంజ్‌కు తిరుగులేని పోటీనిచ్చిన శ్రీముఖి బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత మ‌రిన్ని బుల్లితెర ప్రాజెక్ట్స్‌తో బిజీగా మారింది. అదే స‌మ‌యంలో ఆమె ప్ర‌ధాన పాత్ర‌లో క్రేజీ అంకుల్స్ అనే సినిమా కూడా రూపొందింది. అది పెద్ద‌గా స‌క్సెస్ కాక‌పోయినా రెమ్యున‌రేష‌న్ ప‌రంగా శ్రీముఖి బాగానే డ‌బ్బులు రాబ‌ట్టుకుంద‌నే వార్త‌లు నెట్టింట హ‌ల్ చ‌ల్ చేశాయి.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here