నా కూతురిని పెళ్లి చేసుకోవా అని అడిగా.. ఇంతలో స‌న్నీని అన్న‌య్య అంది: బిగ్‌బాస్ ఉమాదేవి

  169
  0
  Sunny

  బిగ్ బాస్-5లో దూసుకుపోతున్నాడు వీజే సన్నీ. ప్రస్తుతం టైటిల్ రేస్‌లో షణ్ముఖ్, సన్నీల మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది. ఆన్ లైన్ ఓటింగ్‌లో సన్నీ కంటే షణ్ముఖ్ ముందుంటే.. ఆట తీరులో మాత్రం సన్నీ మెరుగైన ప్రదర్శన ఇస్తున్నాడు. ఇదిలా ఉంటే.. బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసిన ఉమాదేవి.. సన్నీ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. హౌస్‌‌లో ఉన్నప్పుడు సన్నీని అల్లుడూ అల్లుడూ అని అనేది ఈ ముద్దుల అత్త.

  అయితే సన్నీని ఏదో సరదాకి అల్లుడు అని పిలవలేదు ఉమాదేవి. నిజంగానే తన మొదటి కూతురుకి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నట్టు చెప్పింది ఉమాదేవి. ఆమె మాట్లాడుతూ.. ‘సన్నీ‌తో నాకు బిగ్ బాస్‌కి వెళ్లకముందే పరిచయం ఉంది.. సన్నీని అల్లుడు అని బిగ్ బాస్ హౌస్‌లో అనడం కాదు.. అంతకు ముందు నుంచి అల్లుడు అనేదాన్ని మేం ఇద్దరం కలిసి సీరియల్ చేశాం.. నాలుగేళ్లు ట్రావెల్ చేశాం. ఆ టైంలో నేను సన్నీని అల్లుడ్ని చేసుకుందాం అనుకున్నా.. ఎలాగూ నిన్ను అల్లుడని పిలుస్తున్నా కదరా.. నాకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.. పెద్దమ్మాయిని పెళ్లి చేసుకో అని చెప్పా.

  ఆ మాటకు సన్నీ.. అత్తా.. నువ్వేమో నన్ను అల్లుడు అంటున్నావు.. ఆ మాట నీ పెద్ద కూతురుకి చెప్పేలోపు.. నీ చిన్న కూతురు వచ్చి సన్నీ అన్నయ్యా అనేసింది. అలాంటప్పుడు నేను మీ అమ్మాయిని పెళ్లి ఎలా చేసుకుంటాను అని అన్నాడు. అదేదో ఊరికే అన్నాదిరా.. అని అంటే.. కాదు కాదు వాళ్లు నాకు చెల్లెల్లు.. నువ్ నాకు అత్తవి అని అన్నాడు. ఇదేం వరసరా.. బయటవాళ్లు వింటే బాగోదని అంటే.. ఏం పర్లేదు.. అనుకుంటే అనుకోనియ్యి నువ్ నాకు అత్తవి.. వాళ్లు చెల్లెలు అని ఫిక్స్ అయిపోయాడు.

  వాడు అలా ఫిక్స్ కాకపోతే.. నా కూతుర్ని ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నా.. నాలుగేళ్ల క్రితమే ఈ మాట అనుకున్నా. కానీ కుదర్లేదు. ఫస్ట్ రోజుని సన్నీని చూసినప్పుడే నాకు కనెక్ట్ అయ్యాడు.. చాలా నచ్చాడు.. అందుకే మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నా. ఈలోపు వీళ్లు అన్నయ్యా అనేశారు. నిజానికి ఎవర్నైనా మొదట అన్నయ్య అనే అంటారు.. కానీ వాడు స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయిపోయాడు.

  బిగ్ బాస్ హౌస్‌లో సన్నీ మొదటి హమీదాకి ట్రై చేసేవాడు. ఒరేయ్ నీకెందుకురా.. అది చాలా తెలివైనది నీకు వర్కౌట్ కాదురా అంటే.. బాగుంది అత్తా చూద్దాం ట్రై చేద్దాం అనేవాడు. తీరా ఆ పిల్ల సన్నీని సైడ్ వేసి శ్రీరామ్ దగ్గరకు వెళ్లింది.. మాముందే శ్రీరామ్‌తో ముచ్చట్లు పెట్టి మసాజ్‌లు చేయించుకునేది’ అంటూ చెప్పుకొచ్చింది ఉమాదేవి.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here