జెస్సీని బ‌య‌ట‌కు పంపించేసిన బిగ్‌బాస్‌?

  91
  0
  Jessy

  బిగ్‌బాస్-5 తెలుగు రియాలిటీ షో ప్రస్తుతం 10వ వారంలోకి అడుగుపెట్టింది. ప్రతీ ఒక్కరూ తమదైన శైలిలో ఆటల్లో ఇచ్చి పడేస్తున్నారు. తగ్గేదేలే అన్నట్లు ఆట ఆడుతున్నారు. నామినేషన్ల ప్రక్రియలో కూడా అదే విధంగా దూకుడుగా ప్రవర్తిస్తున్నారు. ఇదిలా ఉండగా.. 19 మంది కంటెస్టెంట్లతో మొదలైన ఈ బిగ్ బాస్ షో ప్రస్తుతం 10 మంది ఉన్నారు. మొదటి ఆరు వారాల వరకు మోడల్ గా పేరుతెచ్చుకున్న జెస్సీ తనదైన ముద్ర వేసుకున్నాడు.

  గేమ్స్ లో ఎంతో చురుగ్గా పాల్గొంటూ ఓ వారం కెప్టెన్ కూడా అయ్యాడు. అయితే గత రెండు మూడు వారాల నుంచి అతడు హౌస్ లో ఇతర కంటెస్టెంట్ల కంటే డల్ గా కనిపిస్తున్నాడు. దీంతో జస్వంత్ పడాల తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో వైద్య పరీక్షలు, ట్రీట్‌మెంట్ కోసం బయటకు పంపించినట్టు తెలుస్తోంది. అయితే అతడు అనారోగ్యానికి సంబంధించిన కారణాలు ఏంటంటే.. అతడు వాంతులు, విరేచనాలు ఎక్కువగా అవుతన్నాయని.. వాటితో పాటు అతడు ఇతర సమస్యలతో బాధపడుతుంటడం షోలో కనిపించింది. అతడు చాలా సార్లు వెర్టిగో అనే సమస్యతో బాధపడుతున్నట్లు చెప్పాడు.

  ఈ సమస్య ఉంటే.. ఎక్కువగా తల తిరగడం, కంటిచూపు తగ్గడం, ఒక చెవిలో వినికిడి లోపం ఏర్పడటం, సరిగా నిలబడలేకపోవడం, చెవిలో ఇబ్బందికి గురిచేసే శబ్దాలు, చెమటలు పట్టడం, వాంతులు చేసుకోవడం లాంటి సమస్యలు ఉంటాయి. అదే అతడి విషయంలో జరుగుతోంది. ఇలా అతడు టాస్క్ లు కూడా ఆడకుండా విశ్రాంతి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అది మనం కూడా చూస్తూనే ఉన్నాం. నిన్న జరగిన ఫండే ఎపిసోడ్ లో కూడా జెస్సీ నాగార్జున.. బిగ్ బాస్ వద్దు అన్నా కూడా నీవు టాస్క్ లో పాల్గొంటున్నావ్ అంటూ ప్రశంసించారు కూడా.

  ఇలా అతడు త్వరగా కోలుకోవాలని జెస్సీకి ఉపశమనం కలిగించే మాటలు చెప్పాడు నాగార్జున. దీనిపై కాస్త సీరియస్ గా తీసుకున్న బిగ్ బాస్ అతడిని ట్రీట్ మెంట్ కోసం హౌస్ నుంచి పంపించేసినట్లు తెలుస్తోంది. అయితే జెస్సీ తాత్కాలికంగా ట్రీట్‌మెంట్ కోసం వెళ్లాడా? లేక పూర్తిగా గేమ్ నుంచి బయటకు వచ్చాడా? అనే విషయంపై క్లారిటీ లేదు. అయితే బిగ్‌బాస్ విడుదల చేసే తాజా ప్రోమోలో ఏదైనా విషయాన్ని వెల్లడిస్తాడా అనేది వేచి చూడాల్సిందే. ఈ విషయం బటయకు రావడంతో జెస్సీ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

   

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here