కేటీఆర్‌, సోనూసూద్ ఒక‌రిపై ఒక‌రు ఏం చెప్పుకున్నారో తెలుసా!

  163
  0
  KTR Sonusood

  క‌రోనా విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో సినీన‌టుడు రియ‌ల్ హీరో సోనూసూద్ చేసిన సేవ‌ల‌ను తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్ర‌శంసించారు. నిస్వార్థపూరితంగా ఆయ‌న సేవలు చేశార‌ని చెప్పారు. హైద‌రాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో తెలంగాణ సోషల్‌ ఇంపాక్ట్‌ గ్రూప్‌ ఆధ్వర్యంలో కొవిడ్‌ వారియర్స్‌కు సన్మానం చేశారు. ఇందులో కేటీఆర్, సోనూసూద్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ…

  సమాజంలో సవాళ్లు ఎదురైన‌ప్పుడు ప్రభుత్వం మాత్ర‌మే అన్ని పనులూ చేయడం సాధ్యం కాద‌ని చెప్పారు. సోష‌ల్ మీడియాలో విమర్శలు చేయడం చాలా తేలికేన‌ని చెప్పారు. అయితే, బాధ్యతగా సేవలు చేయడం గొప్ప అని ఆయ‌న అన్నారు. సోనూసూద్ పేద ప్ర‌జ‌ల‌కు సేవలు చేస్తోంటే ఆయ‌న ఇళ్లు కార్యాల‌యాల‌పై ఐటీ, ఈడీ దాడులు చేయించి, ఆయ‌న‌ను భ‌య‌పెట్టాల‌ని అనుకున్నార‌ని కేటీఆర్ ఆరోపించారు. ఆయ‌న‌కు స‌మాజంలో ఉన్న ఇమేజ్ ను తగ్గించే ప్రయత్నం చేశారని అన్నారు.

  సోనూసూద్ భయపడాల్సిన అవసరం లేదని కేటీఆర్ భ‌రోసా ఇచ్చారు. ఆయన వెంట తామంతా ఉన్నామని తెలిపారు. ఈ సంద‌ర్భంగా సోనూసూద్‌ మాట్లాడుతూ.. నేత‌లు అంద‌రూ కేటీఆర్ లా ఉంటే తనలాంటి వారి అవసరం స‌మాజానికి ఉండదని కొనియాడారు. క‌రోనా వల్ల చాలా మంది ఉద్యోగాలు, ఆత్మీయులను కోల్పోయారని ఆయ‌న చెప్పారు. తాను దేశ వ్యాప్తంగా సేవా కార్య‌క్ర‌మాలు చేశాన‌ని వివ‌రించారు.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here