లాలా భీమ్లా దంచికొట్టు… దుమ్మురేపుతున్న ప‌వ‌ర్‌స్టార్ సాంగ్‌!

  142
  0
  Powerstar Pavankalyan

  పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌, రానా ద‌గ్గుబాటి కీల‌క‌పాత్ర‌ల్లో నటిస్తోన్న పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘భీమ్లానాయక్‌’. మలయాళంలో సూపర్‌హిట్‌ విజయాన్ని అందుకున్న ‘అయ్యప్పనుమ్‌ కోషియం’ రీమేక్‌గా ఈ సినిమా సిద్ధమవుతోంది. సాగర్‌ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా ఓ స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ బయటకు వచ్చింది. ‘సౌండ్‌ ఆఫ్‌ భీమ్లానాయక్‌’ పేరుతో మూడో పాటను విడుదల చేశారు.

  ‘లాలా భీమ్లా.. అడవి పులి.. గొడవపడి’ అంటూ సాగే పాట సినిమాలో పవన్‌కల్యాణ్‌ పాత్రను తెలియజేసేలా రూపొందించారు. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ ఈ పాటను రచించారు. సెన్సేషనల్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్‌ స్వరాలు అందించగా అరుణ్ కౌండిన్య పాటను మరింత పవర్‌ఫుల్‌గా ఆలపించారు. విడుదల చేసిన కొన్ని క్షణాల్లోనే ఈ పాట ఫుల్‌ క్రేజ్‌ సొంతం చేసుకుని యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది.

  మరోవైపు ఈ సినిమాలో నటుడు రానా కీలకపాత్ర పోషిస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో ఆయన డేనియల్‌ శేఖర్‌గా కనిపించనున్నారు. రానాకు జోడీగా సంయుక్త మేనన్‌.. పవన్‌కు జోడీగా నిత్యామేనన్‌ సందడి చేయనున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here