స‌మ్మ‌ర్ బ‌రిలో మ‌హేశ్ “స‌ర్కార్ వారి పాట‌”

  59
  0
  superstar

  సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌బాబు ‘సర్కారు వారి పాట’ సంక్రాంతి రేసు నుంచి తప్పుకొంది. స‌మ్మ‌ర్ బరిలో నిలిచేందుకు కొత్త ముహూర్తం ఖరారు చేసుకుంది. ఈ విషయాన్ని దర్శక నిర్మాతలు బుధవారం అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు విడుదల తేదీతో కూడిన ఓ కొత్త పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నారు. మహేష్‌బాబు హీరోగా పరశురామ్‌ తెరకెక్కిస్తున్న చిత్రమిది.

  మైత్రీ మూవీ మేకర్స్‌, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, 14రీల్స్‌ ప్లస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కీర్తి సురేశ్‌ కథానాయిక. సంక్రాంతి సందర్భంగా జనవరి 13న విడుదల కావాల్సిన ఈ సినిమాని వాయిదా వేశారు. వచ్చే ఏడాది ఉగాది సందర్భంగా ఏప్రిల్‌ 1న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు.

  ఈ సందర్భంగా విడుదల చేసిన కొత్త పోస్టర్‌లో మహేష్‌ చెవిపోగు, మెడపై రూపాయి నాణెం టాటూతో స్టైలిష్‌గా కనిపించారు. బ్యాంకు కుంభకోణం నేపథ్యంలో సాగే కథతో ఈ చిత్రం రూపొందుతున్నట్లు సమాచారం. మహేష్‌ బ్యాంక్‌ అధికారిగా కనిపించనున్నట్లు తెలిసింది. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటోంది. ఈ సినిమాకి సంగీతం: తమన్‌, ఛాయాగ్రహణం: ఆర్‌.మధి.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here