రెడ్ క‌ల‌ర్ డ్రెస్‌లో జిగేల్ జిగేల్ అనిపిస్తున్న పూన‌మ్‌కౌర్‌!

  58
  0
  poonam

  అందాల తార పూన‌మ్ కౌర్ ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఎస్వీకృష్ణ‌ రెడ్డి దర్శకత్వంలో 2006లో వచ్చిన ‘మాయాజాలం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ సినిమా తర్వాత..అడపా దడపా పలు సినిమాల్లో నటించింది. కానీ ఏ సీనిమా పెద్దగా పేరు తీసుకురాలేదు. దీంతో హీరోయిన్ పాత్రల్నీ వదిలి..హీరోలకు చెల్లెలి పాత్రల్నీ వేయడం ఆరంభించింది.

  అంతేకాకుండా పూనమ్ కౌర్ ఇటు తెలుగు సినిమాలు చేస్తూనే..కన్నడ, తమిళ సినిమాలు చేసింది. ప్రస్తుతం అవకాశాలు తగ్గడంతో ఆమె సినిమాలు ఏవి పెద్దగా రావడం లేదు. అయితే ఆమె తన సినిమాల కంటే..ఆమె చుట్టూ అల్లుకున్న వివాదాల ద్వారా పాపులర్ అయ్యింది. ఒక్కోసారి సోషల్ మీడియాలో ఈమె చేసే ట్వీట్ లు తరచు వివాదాలకు దారి తీస్తాయి.కొన్ని ఉద్దేశపూర్వకంగా ఉండగా.. సమాజంలో జరుగుతున్న విషయాలపై కూడా బాగా రియాక్ట్ అవుతుంది.

  సోషల్ మీడియాలో అడుగుపెట్టింది అంటే చాలు మొత్తానికి ఏదో ఒక కౌంటర్ తో దింపేస్తుంది. ఇక రాజకీయ విషయాలలో కూడా బాగా కౌంటర్లు వేస్తుంది ఈ బ్యూటీ. మ‌రోవైపు తాజాగా రెడ్ కలర్ డ్రెస్‌లో పరువాల విందు చేసింది పూన‌మ్‌. ప్ర‌స్తుతం వీటికి సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో హల్‌చ‌ల్ చేస్తున్నాయి.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here