ఆర్య‌న్‌కు బెయిల్ రాగానే పార్టీలో ర‌చ్చ చేసిన కింగ్‌ఖాన్ కూతురు..

  152
  0
  Suhana

  షారూఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటుంది. కానీ, తన సోదరుడు ఆర్యన్ ఖాన్ జైలు పాలవడంతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలను పోస్ట్ చేయడం మానుకుంది. తాజాగా తన సోదరుడికి బెయిల్ రావడంతో ఆమె పార్టీ చేసుకుంది. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం మొదలుపెట్టాయి. కింగ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ న్యూయార్క్‌లో నివసిస్తోంది.

  ఈ మధ్యే ఆమె అక్కడ హాలోవిన్ పార్టీని జరుపుకొంది. ఆ పార్టీ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ఈ ఫొటోల్లో ఆమె తన స్నేహితురాలైన ప్రియాంకతో కలిసి కనిపిస్తోంది. ఆ ఫొటోల్లో ఆమె నీలం రంగు దుస్తులు ధరించి కనిపించింది. ఆమె స్నేహితురాలు ఆ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పంచుకుంది. సుహానా వాటి కింద ‘‘ ఐ లవ్ యూ ’’ అని కామెంట్ చేసింది.

  ఆర్యన్ జైలు కెళ్లిన అనంతరం ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండలేదు. కేవలం మూడు సార్లు మాత్రమే ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలను పోస్ట్ చేసింది. తన సోదరుడికి బెయిల్ వచ్చిందని వార్త తెలియగానే ఒక ఫొటోను పోస్ట్ చేసి ఐ లవ్ యూ అనే మెసేజ్‌ను ఆ ఫొటో కింద రాసింది. ఆ ఫొటో పోస్ట్ చేసిన గంట‌లోపే 2.5లక్షలకు పైగా నెటిజన్లు లైక్ చేశారు.

  Suhana latest pics

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here