తండ్రి మృత‌దేహం చూసి గుండేలావిసేలా విల‌పించిన పెద్ద కూతురు..

  101
  0
  punith daughter

  కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అంత్య క్రియలు ఆదివారం ఉదయం పూర్తి అయ్యాయి. శుక్రవారం మృతి చెందిన పునీత్ రాజ్ కుమార్ అంత్య క్రియలను శనివారం సాయంత్రం వరకు నిర్వహించాలని అన్ని ఏర్పాట్లు చేశారు. కన్నడ ప్రభుత్వం అందుకు సిద్దంగా ఉంది. అయితే యూఎస్ లో ఉంటున్న పునీత్ రాజ్ కుమార్ పెద్ద కుమార్తె ధృతి బెంగళూరు చేరుకోవడం ఆలస్యం అయ్యింది. ఆమె శనివారం సాయంత్రంకు చేరుకున్నారు. బెంగళూరు కంఠీరవ స్టేడియంకు ఆమె చేరుకుని తండ్రికి కన్నీటి నివాళి సమర్పించారు.

  గుండెలను గుడిగా చేసిన నాన్నిక లేడని తెలిసి పునీత్‌ రాజ్‌కుమార్‌ కూతురు ధృతి తల్లడిల్లిపోయింది. తమకోసమే తపించిన గుండె ఆగిందని తెలిసి ఆ చిన్ని హృదయం చివురుటాకులా వణికిపోయింది. అల్లంత దూరాన అమెరికా నుంచి ఆఘమేఘాల మీద పయనమైంది. ఏడ్చి ఏడ్చి కన్నీరింకిపోయాయి. పిలిచి పిలిచి నాన్నిక లేడని, రాలేడన్న వాస్తవం ఆమెను నిశ్చేష్టురాలిని చేసింది. తెలియని నిస్సహాయత చుట్టుముట్టేసింది. నాన్నని చూడగానే గుండె గొంతుకలోకొచ్చినట్టయ్యింది.

  నాన్నా ఒక్కసారి ఒకే ఒక్కసారి రాలేవా అంటూ లోలోపల గుండెలవిసేలా విలపిస్తోంది. అమెరికా నుంచి వచ్చి తండ్రిని చూడరాని స్థితిలో చూసి కన్నీటి పర్వంతమయింది ధృతి. తల్లీ కూతుళ్లను ముగ్గురిని ఓదార్చడం ఎవరి తరం కాలేదు. తండ్రి భౌతికకాయంపై పడి కన్నీళ్లు పెట్టుకున్నారు. డాడీ.. మమ్మల్ని వదిలి వెళ్లావా.. నీవు ఇక మాకు కనిపించవా అంటూ బోరున విలపించారు. అంతకు ముందు అమెరికా నుంచి డైరెక్ట్‌గా వచ్చిన ధృతి.. బెంగళూరు ఎయిర్‌పోర్టులో ల్యాండ్‌ అయ్యారు. అక్కడి నుంచి నేరుగా ప్రత్యేక కాన్వాయ్‌లో ఇంటికి చేరుకొని.. ఆ వెంటనే తండ్రి భౌతికకాయం ఉన్న కంఠీరవ స్టేడియానికి వచ్చారు. వచ్చి రాగానే ఒక్కసారిగా పార్ధీవదేహంపై పడి విలపించారు.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here