ఎవ‌డు ఆపుతాడు మ‌న‌ల్ని.. అన్‌స్టాప‌బుల్ షోలో వ‌ణికించిన‌ బాల‌కృష్ణ!

  144
  0
  balayya

  నంద‌మూరి బాల‌కృష్ణ తొలిసారిగా హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్న విష‌యం తెలిసిందే. ప్ర‌ముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ఆహా వేదిక‌గా సెల‌బ్రిటీ టాక్ షో అన్‌స్టాప‌బుల్ హోస్ట్‌ బాల‌కృష్ణ‌. న‌వంబ‌ర్‌ 4నుంచి ఈ షో ప్ర‌సారం కానుంది. ఈ నేప‌థ్యంలో తాజాగా అన్‌స్టాప‌బుల్ తొలి ఎపిసోడ్ ప్రోమోని ఆహా రిలీజ్ చేసింది. ఈ ప్రోమోలో డైలాగ్ కింగ్ మోహ‌న్‌బాబు గెస్ట్‌గా సాగిన ఈ ఎపిసోడ్‌లో బాల‌య్య త‌న‌దైన శైలిలో ఆక‌ట్టుకున్నారు. కెరీర్‌లో చూసిన ఎత్తుప‌ల్లాల‌తో పాటు ఎన్నో వ్య‌క్తిగ‌త, రాజ‌కీయ విష‌యాల‌పై మోహ‌న్‌బాబు త‌న అనుభ‌వాల‌ను షేర్ చేసుకున్నారు.

  ఇందులో భాగంగా ఓ రౌండ్‌లో మీరు న‌టించిన చిత్రాల్లో అస్స‌లు చూసుకోలేని చిత్ర‌మేది? అని బాల‌కృష్ణ ప్ర‌శ్నించ‌గా ప‌టాలం పాండు అని మోహ‌న్‌బాబు స‌మాధానం చెప్ప‌గానే సినిమా ప్లాప్ అయ్యిందా అంటూ బాల‌య్య న‌వ్వులు పూయించారు. హీరోగా నిల‌బ‌డాల‌నే ప్ర‌య‌త్నం విఫ‌ల‌మ‌వుతున్న రోజుల్లో మీరు ఎప్పుడైనా బాధ‌ప‌డ్డారా? అని బాల‌య్య ప్ర‌శ్నిండంతో మోహ‌న్‌బాబు ఆనాటి రోజుల్ని గుర్తు చేసుకున్నారు. త‌లుచుకుంటే ఇప్ప‌టికీ క‌న్నీళ్లు వ‌స్తుంటాయి.

  నా బిడ్డ‌ల‌కు అన్యాయం చేస్తున్న‌ట్లు అనిపించింది. క‌ష్టాలు ఎదుర్కోవ‌డం కోసం ఆరోజుల్లో మేం ఉంటున్న ఇంటిని కూడా అమ్మేశాను. నాకు ఎవ్వ‌రూ సాయం చేయ‌లేదు అంటూ మోహ‌న్‌బాబు భావోద్వేగానికి గుర‌య్యారు. మ‌రోవైపు ఈ షోలో మంచుల‌క్ష్మీ, విష్ణు సైతం పాల్గోని జై బాల‌య్య జైజై బాల‌య్య అంటూ ల‌క్ష్మీ అంటూ స‌ర‌దాగా సంద‌డి చేశారు. అలాగే ఈ ప్రోమోలో బాల‌య్య అనిపించింది అందాం.. అనుకున్న‌ది చేద్దాం.. ఎవ‌రు ఆపుతారో చూద్దాం అంటూ డైలాగ్ చెప్ప‌డంతో చ‌ప్ప‌ట్ల‌తో మారుమోగిపోయింది.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here