శ్రీ‌రెడ్డితో సుడిగాలి సుధీర్ ర‌చ్చ రచ్చ‌.. వైర‌ల్‌గా మారిన పిక్స్‌!

  105
  0
  Sudigali sudheer

  టాలీవుడ్ సంచ‌ల‌నం శ్రీ రెడ్డి గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు.ఈమె సోష‌ల్ మీడియా వేదిక‌గా ఎదుటి వారిపై చేసే దాడి భీబ‌త్సంగా ఉంటుంది.సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి కామెంట్స్ చేసి సంచలనం రేపిన శ్రీ రెడ్డి ఆ తర్వాత ఒక్కొ స్టార్ గురించి చెబుతూ సెన్సేషన్ సృష్టించారు. ఈ మధ్య నాగచైతన్య- సమంత కపుల్ గురించి కామెంట్స్ చేసింది. బోల్డ్ మాటలతో పిచ్చెక్కించడమే కాదు ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఇష్యూలపై కామెంట్స్ చేయడంలో ముందుంటున్న శ్రీ రెడ్డి..

  తాజాగా ఏపీ రాజకీయాల విషయమై మరోసారి నోరు విప్పింది. గత కొన్ని రోజులుగా హీటెక్కిన ఏపీ రాజకీయ పరిస్థితులపై అటాక్ చేసింది. తనకు ఇష్టమైన ఏపీ సీఎం జగన్‌కి సపోర్ట్ చేస్తూ ప్రత్యర్థులపై శివాలెత్తింది శ్రీ రెడ్డి. అరెస్ట్ అయిన ఏపీ టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిని నోటికొచ్చిన బూతులు తిట్టడమే గాక, పవన్ కళ్యాణ్ ఇష్యూ తెరపైకి తెచ్చి సంచలన కామెంట్స్ చేసింది. ఒరేజ్ దద్దమ్మ.. నువ్వు మొదలు పెట్టావురా సన్నాసి, దద్దమ్మ అని. నిన్ను చూసే వీడు రెచ్చిపోతున్నాడు. ఇలాంటి దరిద్రపు బూతు రాజకీయాలు మొదలుపెట్టిందే నువ్వు అంటూ కామెంట్స్ చేసింది.

  అయితే శ్రీ రెడ్డి ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ టాపిక్‌గా నిలుస్తూనే ఉంటుంది. ఈ అమ్మ‌డు తాజాగా సుడిగాలి సుధీర్, బిగ్ బాస్ ఫేం ప్రియ‌తో క‌లిసి ఓ ఫొటో దిగింది. ఈ పిక్ ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారింది. చూడ్డానికి ఇది పాత ఫొటోలా క‌నిపిస్తుంది. 50 రోజులు బిగ్ బాస్ లో ఉండి ప్రియ బ‌య‌ట‌కు రావ‌డంతో ఆమె ఫొటోల‌ను బ‌య‌ట‌కు తీస్తున్నారు. ఈ క్ర‌మంలోనే శ్రీ రెడ్డి, సుధీర్‌తో ప్రియ దిగిన పిక్ వైర‌ల్ గా మారింది. ప్రియ‌… బిగ్ బాస్ హౌస్‌కి వచ్చిన తరువాత మెయిన్ రోల్ అయిపోయింది.

  బిగ్ బాస్ హౌస్‌లో 50రోజుల‌ జర్నీలో ప్రియ రేపిన చిచ్చు యాంకర్ రవికి నిద్రలేకుండా చేసింది. లహరితో బాత్‌ రూం రొమాన్స్ ఇష్యూతో ప్రియ ఎక్కడికో వెళ్లిపోయింది. ఆ తరువాత సన్నీని చెంపపగలగొడతా అంటూ వింత వింతగా ప్రవర్తించి ఆకాశాన్నంటిని ఇమేజ్‌ని పాతాళానికి పడిపోయేట్టుగా చేసుకుంది. చివరికి ఏడో వారంలో ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. ప్ర‌స్తుతం సుధీర్ జ‌బర్దస్త్ ఎక్స్ ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి షోల‌తో బిజీగా ఉన్నాడు. ఇక శ్రీ రెడ్డి చెన్నైలో ఉన్న‌ట్టు తెలుస్తుంది. కాగా, ప్ర‌స్తుతం చ‌క్క‌ర్లు కొడుతున్న ఈ ఫొటో దిగి మూడు నాలుగేళ్లు కావొచ్చని తెలుస్తుంది.

   

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here