“మాస్ట‌ర్ చెఫ్” బాగోతాన్ని బ‌య‌ట‌పెట్టిన త‌మ‌న్నా..

  64
  0
  Thamanna

  మాస్ట‌ర్ చెఫ్ షో నిర్వాహ‌కులు మిల్క్‌బ్యూటీ త‌మ‌న్నా ప్లేస్‌లో యాంక‌ర్ అన‌సూయ‌ను హోస్ట్‌గా తీసుకున్న‌ర‌నే విష‌యం తెలిసిందే. దీంతో షో ప్రొడ‌క్ష‌న్ హౌస్‌కు త‌మ‌న్నా లీగ‌ల్ నోటీసులు పంపించింది. త‌మ‌న్నా లీగ‌ల్ యాక్ష‌న్‌పై షో నిర్వాహ‌కులు తాజాగా వివ‌ర‌ణ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. త‌మ‌న్నా వ‌ల్ల దాదాపు 5కోట్ల రూపాయ‌ల న‌ష్టం వ‌చ్చింద‌ని నిర్వాహ‌కులు అంటున్నారు. మొత్తం 18ఎపిసోడ్‌ల‌కు గాను త‌మ‌న్నాతో రూ.2కోట్ల పారితోషికంతో అగ్రిమెంట్ కుదుర్చుకున్నార‌ట‌.

  అయితే ఇత‌ర క‌మిట్‌మెంట్స్ కార‌ణంగా త‌మ‌న్నా కేవ‌లం 16రోజుల షూటింగ్‌కు మాత్ర‌మే వ‌చ్చింద‌ని, మిగ‌తా రెండు రోజులు రాలేద‌ని షో నిర్వాహ‌కులు ఆరోపిస్తున్నారు. ఆ రెండు రోజులు రాక‌పోవ‌డంతో 300మంది టెక్నిషియ‌న్స్ ప‌నిచేస్తోన్న త‌మ షోకు రూ.5కోట్లు న‌ష్టం వ‌చ్చింద‌ని చెబుతున్నారు. అప్ప‌టికే త‌మ‌న్నాకు 1.5ల‌క్ష‌ల రూపాయ‌లు ఇచ్చామ‌ని, మిగ‌తా రోజుల షూటింగ్ కూడా పూర్తి చేసుంటే మొత్తం డ‌బ్బులు చెల్లించేవార‌మ‌ని వారు పేర్కొన్న‌ట్లు స‌మాచారం.

  అంతేగాక అగ్రిమెంట్ ప్ర‌కారం షూటింగ్ పూర్తి చేయ‌కుండా.. సెకండ్ సీజ‌న్ అడ్వాన్స్ ఇవ్వాల‌ని ఆమె డిమాండ్ చేస్తున్న‌ట్లు చెప్పారు. అస‌లు సెకండ్ సీజ‌న్‌కు ఆమెను తీసుకోవాల‌ని తాము అనుకోలేద‌ని నిర్వాహ‌కులు స్ప‌ష్టం చేసిన‌ట్లు స‌మాచారం. త‌మ‌న్నా హోస్ట్‌గా మాస్ట‌ర్ చెఫ్ షో ప్రారంభ‌మైంది. అయితే కొన్ని కార‌ణాల వ‌ల్ల ఆమె స్థానంలో అన‌సూయ‌ను తీసుకున్నారు. దీంతో ఈ విష‌యం కాస్తా చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

  త‌న స్థానంలో అన‌సూయ‌ను తీసుకోవ‌డ‌మే కాకుండా, త‌న‌కు ఇస్తాన‌న్న రెమ్యున‌రేష‌న్ కూడా షో నిర్వాహ‌కులు ఇవ్వ‌లేదంటు త‌మ‌న్నా మాస్ట‌ర్ చెఫ్ నిర్వాహ‌కుల‌పై లీగ‌ల్ యాక్ష‌న్‌కు దిగిన‌ట్లు తెలుస్తోంది. కాగా ఆగ‌ష్టు 27న ప్రారంభ‌మైన మాస్ట‌ర్ చెఫ్ తొలి మూడు షోల‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఆ త‌ర్వాత క్ర‌మంగా ఈ షో పెద్ద‌గా ఆక‌ట్టుకోలేక‌పోయింది.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here