రాజ‌మౌళి, చ‌ర‌ణ్‌ల విడ‌దీయ‌రాని బంధానికి మెగాస్టార్ కార‌ణ‌మే..

  282
  0
  rrr

  సినీ ఇండ‌స్ట్రీలో ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి అంటే తెలియ‌ని వారుండ‌రు. స్టూడెంట్ నెం1 చిత్రం ద్వారా సినీ రంగ‌ ప్ర‌వేశం చేసి ఆ త‌ర్వాత వ‌రుస‌గా ఎన్నో హిట్ చిత్రాల‌ను టాలీవుడ్ కు అందించారు. ఇక ఇప్ప‌టివ‌ర‌కు ఒక్క ప్లాప్ కూడా చ‌విచూడ‌క‌పోవ‌డం రాజ‌మౌళి ప్ర‌త్యేక‌త‌. ఇక రాజ‌మౌళి తీసిన బాహుబ‌లి సినిమాలు తీసి సినీ ప‌రిశ్ర‌మ‌లో రికార్డుల‌ను తిరిగ రాశాయి.తెలుగు సినిమాల చరిత్రను ప్రపంచానికి పరిచయం చేసిన దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి.

  ఇక ఇదిలా ఉంటే రాజమౌళి సినిమాలో మెగా ప‌వ‌ర్‌స్టార్‌ రామ్ చరణ్ కు ఎలాగైనా అవకాశం వచ్చేలా చేయాలని మెగాస్టార్ చిరంజీవి తీవ్ర ప్రయత్నాలు చేశారు. అయితే రాజమౌళి మాత్రం మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ ను దూరం పెట్టారు. రామ్ చరణ్ ను రాజమౌళి డైరెక్టర్ గా సినిమాని ఇండస్ట్రీకి పరిచయం చేయలేనని అన్నారట. అయితే ఆ టైమ్ లో రాజమౌళి సినిమాలతో ఫుల్ బిజీగా ఉండటం వల్లే ఆ మాట అన్నట్లు తెలుస్తోంది….

  అలా రాజమౌళి డైరెక్షన్ లో రామ్ చరణ్ మొదటి సినిమా మిస్ అయ్యింది. అయితే తర్వాత రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా మగధీర సినిమాను తెరకెక్కించి బ్లాక్ బస్టర్ హిట్ ను గిఫ్ట్ గా ఇచ్చారు. ఆ తర్వాత రామ్ చరణ్ కెరీర్ లో వెనక్కి తిరిగి చూసుకోలేదు. అంత హిట్ ని అందించిన రాజమౌళి అంటే ప్రత్యేకమైన అభిమానం అని రామ్ చరణ్ ఎన్నో సందర్భాల్లో తెలిపారు…. అందుకే షూటింగ్ సెట్ లో వీరిద్దరూ క్లోజ్ గా ఉండే ఫోటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ ఉంటారు.

  అలాగే రామ్ చరణ్ హార్డ్ వర్క్ కూడా తనకు ఎంతో నచ్చుతుందని ఎస్ ఎస్ రాజమౌళి అన్నారు. లేటెస్ట్ గా రాజమౌళి డైరెక్షన్ లో రామ్ చరణ్, ఎన్టీఆర్ లు హీరోలుగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 7న ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ్ కానుంది.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here