నేడు ప్ర‌భాస్ బ‌ర్త్‌డే.. రాధేశ్యామ్ టీజ‌ర్ రిలీజ్‌!

  194
  0
  prabhas

  యంగ్ రెబెల్ స్టార్ ప్ర‌భాస్ నేడు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు జ‌రుపుకుంటున్నారు. ఈశ్వ‌ర్ అనే సినిమాతో టాలీవుడ్ ఇండ‌స్ట్రీకి ప‌రిచయం కాగా.. తొలి సినిమాతో తెలుగు సినీ ఇండ‌స్ట్రీలో మంచి న‌టుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ త‌ర్వాత రాఘ‌వేంద్ర, వ‌ర్షం, పౌర్ణ‌మి, వంటి చిత్రాల్లో న‌టించి ప్ర‌భాస్ యూత్‌కి చేరువ‌య్యాడు. ల‌వ్‌.. యాక్ష‌న్ ఎమోష‌న‌ల్ గొప్ప‌గా పండించాడ‌నే పేరు తెచ్చుకున్నాడు. ఆయ‌న మార్కెట్ ఒక్క‌సారిగా పెరిగిపోయాయి.

  అలాగే ఛ‌త్ర‌ప‌తి సినిమాతో ఓ రేంజ్‌లో గుర్తింపు తెచ్చుకున్నాడు.. త‌న న‌ట విశ్వ‌రూపం ఈ చిత్రంలో చూపించాడు. మ‌ద‌ర్ సెంటిమెంట్‌తో కూడిన ఈ యాక్ష‌న్ మూవీతో ప్ర‌భాస్ ఫ్యామిలీ ఆడియ‌న్స్‌కి కూడా ద‌గ్గ‌ర‌య్యాడు. ఆ త‌ర్వాత మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ట్‌, డార్లింగ్‌, మిర్చి వంటి చిత్రాల‌తో ఇంకా ఎంతో గుర్తింపు సంపాదించుకున్నాడు. బాహుబ‌లి పార్ట్‌-1, పార్ట్‌-2 సినిమాల‌తో ఏకంగా పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎంతో గుర్తింపు సంపాదించుకున్నాడు ప్ర‌భాస్‌.

  దీంతో ఆయ‌న సినిమాల‌న్నీ పాన్ ఇండియా స్థాయిలోనే రిలీజ్ అవుతున్నాయి. అంత‌టి క్రేజ్‌ను సంపాదించుకున్న ప్ర‌భాస్ భ‌విష్య‌త్తులో వెండితెర‌పై మ‌రింత‌గా విజృంభించ‌బోతున్నాడు. ఆయ‌న ప్ర‌స్తుతం రాధేశ్యామ్‌, స‌లార్‌, ఆదిపురుష్‌, ప్రాజెక్ట్ కె, స్పిరిట్‌, వంటి చిత్రాల్లో న‌టిస్తున్నాడు. నేడు ప్ర‌భాస్ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా రాధేశ్యామ్ మూవీ టీం విషెస్ తెలుపుతూ.. టీజ‌ర్‌ను రిలీజ్ చేశారు. ఆ త‌ర్వాత ప్రాజెక్ట్ కె మూవీ టీం ప్ర‌భాస్‌కీ బ‌ర్త్‌డే విషెస్ తెలిపారు.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here