క్యూట్ లుక్స్‌తో పిచ్చేక్కిస్తున్న కృతిశెట్టి..

  54
  0
  krithi

  ఉప్పెన సినిమాతో ఓ రేంజ్‌లో క్రేజ్ సంపాదించుకుంది బ్యూటీ కృతిశెట్టి. ఆక‌ర్షించే అందంతో కుర్ర‌కారులను ఆక‌ట్టుకుంటోంది. తొలి సినిమానే భారీ హిట్ అవ్వ‌డంతో టాలీవుడ్‌లో గుర్తింపుతో పాటు వ‌రుస‌గా ఆఫ‌ర్లు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఈ బ్యూటీ తాజాగా ఓ ఫోటోషూట్‌కు ఫోజులు ఇచ్చింది. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. లాంగ్ ఫ్రాక్‌లో క్యూట్ ఎక్స్‌ప్రెష‌న్స్ ఇస్తూ నెటిజ‌న్స్ మ‌న‌సులు దోచుకుంటుంది.

  కాగా కృతిశెట్టి ఇప్ప‌టికే నాని శ్యామ్ సింగ‌రాయ్‌, సుధీర్‌బాబు, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, నితిన్ మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం సినిమాల‌తో పాటు లింగుస్వామి, రామ్ పోతినేని కాంబోలో రాబోతున్న చిత్రంలోనూ హీరోయిన్‌గా న‌టిస్తోంది. అలాగే నాగార్జున బంగార్రాజు సినిమాలో చైత‌న్య‌కు జోడీగా ఈ బ్యూటీ చేయ‌బోతుంది. దీనిబ‌ట్టి చూస్తే సినిమాల‌తో ఎంత బిజీగా ఉన్నా కూడా సోష‌ల్ మీడియాలో తెగ సంద‌డి చేస్తుంటుంది కృతిశెట్టి.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here