లోబో సీక్రెట్ రూంలో ఉన్నాడ‌నే విష‌యం ఎలా తెలుసు వీళ్ల‌కీ..

  57
  0
  lobo

  టీవీ ఛానెల్ సంచ‌న‌ల షో బిగ్‌బాస్‌-5 ఇప్ప‌టికే 6వారాలు విజ‌య‌వంతంగా కంప్లీట్ చేసుకుంది. ఆరు వారాల‌కు ఆరుగురు కంటెస్టెంట్‌లు ఎలిమినేట్ కూడా అయ్యారు. ఏడో వారం నామినేష‌న్లు ఆస‌క్తిక‌రంగా మారాయి. ప్ర‌తి నామినేష‌న్ వెనుక స‌న్నీ హ‌స్తం ఉండ‌డంతో ఈ వారం మొత్తం స‌న్నీ పేరుతోనే హౌస్ మార్మోగిపోయింది. ఇక ఇదిలా ఉంచితే.. లోబో సీక్రెట్ రూమ్‌లో ఉంటున్న విష‌యం తెలిసిందే. అయితే లోబో సీక్రెట్ రూంలో ఉంటున్న విష‌యం హౌస్ స‌భ్యుల‌కు తెలుసా? అంటే అవున‌నే చెప్పాల్సి వస్తుంది. సిరి మాట్లాడిన కొన్ని మాట‌లు చూస్తే అనుమానాలు రేకెత్తిస్తున్నాయి..

  ఇప్ప‌టికే దాదాపు ఆరుగురు స‌భ్యులు ఎలిమినేట్ అయ్యారు. ఆదివారం నాటి ఎపిసోడ్‌లో శ్వేతావ‌ర్మ ఎలిమినేట్ అయ్యింది. అలా ఆమెతో క‌లిసి ఆరుగురు స‌భ్యులు ఎలిమినేట్ అయిన‌ట్లు జ‌రిగింది. 19మంది కంటెస్టెంట్స్‌తో ప్రారంభ‌మైన బిగ్‌బాస్-5లో మొద‌టివారం స‌ర‌యు, రెండోవారం ఉమాదేవి, మూడ‌వ వారం ల‌హ‌రి, నాల‌గో వారం న‌ట‌రాజ్ మాస్ట‌ర్, 5వ వారం హ‌మీదా, ఆరో వారం శ్వేతా వ‌రుస‌గా ఎలిమినేట్ అయ్యారు. అయితే 6వ వారంలో శ‌నివారం నాడు లోబో హౌస్ స‌భ్యుల ఓటింగ్ మేర‌కు ఎలిమినేట్ అయిన‌ట్లు నాగార్జున హౌస్ స‌భ్యుల‌కు చూపించారు.

  నిజంగా హౌస్ స‌భ్యుడు ఎలిమినేట్ అయితే ఎలాంటి ప్రొసీజ‌ర్ ఫాలో అవుతారో దాదాపు అదే ప్రొసీజ‌ర్ ఫాలో అయ్యారు. చివ‌రి నిమిషంలో ఇంకా బ‌య‌ట‌కు అడుగుపెట్ట‌డ‌మే ఆల‌స్యం అనుకుంటున్న త‌రుణంలో వెన‌క్కి పిలిచి మిమ్మ‌ల్ని ఎలిమినేట్ చేసే అధికారం మాకు గానీ హౌస్ స‌భ్యుల‌కు గానీ లేదు కేవలం ఆడియన్స్ కు మాత్రమే అవకాశం ఉంటుంది అని చెబుతూ సీక్రెట్ రూమ్ లో ఉండాల్సిందిగా చెప్పి పంపిస్తారు. లోబో సీక్రెట్ రూమ్ కి వెళుతున్నాడు అనే విషయం ముందు నుంచి ప్రచారం జరగడంతో ఆడియన్స్ కి ఒక క్లారిటీ వచ్చేసింది.

  అయితే హౌస్ లోపల ఉన్న సభ్యులు కూడా లోబో సీక్రెట్ రూమ్ లో ఉన్నాడు అనే విషయం మీద క్లారిటీ తోనే ఉన్నట్లు అర్థమవుతోంది. ఎందుకంటే నిన్నటి ఎపిసోడ్ లో సిరి మాట్లాడుతూ ఇప్పటికే ఆరుగురు వెళ్లిపోయారు.. అందులో ఐదుగురు అమ్మాయిలు ఉన్నారు.. ఈవారం శ్వేత సేవ్ అయ్యి ఉంటే నేనే ఎలిమినేట్ అయ్యేదాన్ని అని జస్వంత్ తో చెబుతోంది. ఏంట్రా ఇది దారుణం.. అబ్బాయిలని ఎలిమినేట్ చేయొచ్చు కదా అని జెస్సీ దగ్గర ఎమోషనల్ అయ్యింది సిరి.

  అయితే దాదాపు హౌస్ సభ్యులు ఎలిమినేట్ అయిపోయిన తర్వాత వాళ్ల గురించి మిగతా హౌస్ సభ్యులు మాట్లాడటం అనేది చాలా అరుదు. కానీ నిన్ను చూపించిన ఎపిసోడ్ లో మాత్రం దాదాపు రవి, సన్నీ, ఆనీ మాస్టర్, ప్రియా లాంటివాళ్లు లోబో గురించే మాట్లాడుతున్నట్లుగా చూపించారు. వీరు మాత్రమే కాక మరి కొందరు కూడా లోబో గురించి పాజిటివ్ గా మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నారు.

  రవి, ఆనీ మాస్టర్ కూడా అనాల్సిన వన్నీ అనేసి చివర్లో మంచోడు అని అనడం చూస్తే హౌస్ లోపల లోబో ఉన్నాడు అనే విషయం మీద వీరంతా క్లారిటీ తోనే ఉన్నారని భావించవచ్చు. ఇక బిగ్ బాస్ కూడా లోబో కి ఎలాంటి సీన్లు చూపిస్తే ఇంటి సభ్యుల మనస్తత్వం తెలుస్తుంది అనే విషయం అర్థం అయి అలాంటి సీన్లు చూపిస్తూ లోబోని మరింత దృఢంగా తయారుచేసేలా చేస్తున్నాడు.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here