ప్రియాంక‌సింగ్‌ను మాన‌స్ దూరం పెడుతున్నాడా?

  61
  0
  priyanka manas

  బిగ్‌బాస్‌-5 సీజ‌న్‌లో నుంచి హ‌మీదా ఎలిమినేట్ అయింత‌ర్వాత హౌస్‌లో ఒక్క రొమాంటిక్ క‌పుల్ కూడా లేకుండా పోయింది. కిచెన్ రూం ముచ్చ‌ట్లు, లాన్‌లో నైట్ వాక్, స్విమ్మింగ్ పూల్ ద‌గ్గ‌ర చిలిపి చిలిపి క‌బుర్లు ప్రేక్ష‌కుల‌కు క‌రువయ్యాయ‌నే చెప్పుకోవాలి. ఎప్ప‌టికీ హౌస్‌లో గొడ‌వ‌ల‌తో ప్రేక్ష‌కుల‌కు ఈ షో ఇంట్రెస్ట్ అనిపించ‌ట్లేద‌నే అనుకోవాలి. దీని కోసం మాస‌న్‌, ప్రియాంక సింగ్‌ల మ‌ధ్య ట్రాక్ న‌డిపించాల‌ని బిగ్‌బాస్ ప్ర‌య‌త్నించినా తాజా ప‌రిణామాలు చూస్తే అది కూడా వ‌ర్కౌట్ అయ్యేలా క‌నిపించ‌డం లేదు.

  ప్రియాంక సింగ్‌.. మాన‌స్‌ను అన్న‌య్య అని పిల‌వ‌ను అని చెప్పిన ద‌గ్గ‌ర్నుంచే వీళ్ల మ‌ధ్య ట్రాక్ ఉందేమో అనే భావ‌న ప్రేక్ష‌కుల్లో క‌లిగింది. ప్రియాంక త‌ర్వాత మాన‌స్ బెడ్‌షీట్స్ స‌ర్ద‌టం.. అత‌న్ని వెన్నంటే ఉంటూ త‌న అవ‌స‌రాలు తీర్చ‌డం. దీంతో క్యూట్ క‌పుల్ అయ్యేలా ఉన్నారే అని అనుకున్నారు. త‌ర్వాత మాన‌స్ వైపు నుంచి కూడా కొంత అప్రోచ్ క‌నిపించింది. రేష‌న్ మేనేజ‌ర్ టాస్కులో స‌న్నీని కాద‌ని ప్రియాంక సింగ్ గెలిపించిన‌పుడే ఏదో ఉంద‌ని టాక్ మొద‌లైంది.

  త‌ర్వాత మ‌ళ్లీ వారి మ‌ధ్య దూరం పెరిగింది. మాన‌స్ అంద‌రికీ అన్నం తినిపిస్తూ ప్రియాంక‌ను ప‌ట్టించుకోడు ఆ విష‌యంలో ప్రియాంక చాలా ప‌డింది. ఆ విష‌యం స‌న్నీ ప్రియాంక‌ను ఓదార్చేందుకు ప్ర‌య‌త్నిస్తాడు. ఆ స‌మ‌యంలో పింకీ ఎంతో ఎమోష‌న‌ల్‌గా త‌న‌కు ఎప్పుడు ఏం కావాలో క‌ళ్ల‌లో చూసి తెలుసుకుంటాను. త‌ను మాత్రం అలా కాదు న‌న్ను అవైడ్ చేస్తున్నాడంటూ బాధ ప‌డుతుంది. స‌న్నీ అదే విష‌యాన్ని మాన‌స్‌కు చెప్ప‌గా.. నేను అలా అనుకోలేదు అంటూ వివ‌ర‌ణ ఇచ్చేందుకు చూస్తాడు.

  చివ‌రిగా నాకు మూడుసార్లు బ్రేక‌ప్ అయ్యింది. అన్నీ తెలిస్తే అలా అవ్వ‌దు క‌దా అన్న కోణంలో త‌న బ్రేక‌ప్ స్టోరీ గురించి చెప్పుకొచ్చాడు మాన‌స్‌. ఎప్పుడూ న‌వ్వుతూ న‌వ్విస్తూ ఉండే మాన‌స్‌కు బ్రేక‌ప్ స్టోరీలా అంటూ అభిమానులు ఆశ్చ‌ర్య‌పోయారు. కాగా మాన‌స్‌, ప్రియాంక సింగ్‌ల రిలేష‌న్ కొనసాగుతుందా లేదా అనేది వేచి చూడాలి.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here