మౌనీరాయ్‌ను చూస్తే మంట పుట్టాల్సిందే..

  56
  0
  mouni

  సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌న అందాల‌తో రెచ్చిపోతుంది హాట్ బ్యూటీ మౌనీ రాయ్‌. అవ‌కాశాల కోస‌మో, ఫ్యాన్స్‌ను అల‌రించాల‌న్న ఆలోచ‌న‌తోనో అంద‌రి దృష్టిలో ప‌డాల‌న్న కోరిక‌తోనో చాలా మంది ముద్దుగుమ్మ‌లు అందాలు చూపిస్తున్నారు. అలాంటి వారిలో ప్ర‌ముఖ సీరియ‌ల్ హీరోయిన్ మౌనీరాయ్ ఒక‌రు. డ‌బ్బింగ్ సీరియ‌ల్ ద్వారా ఇప్ప‌టికే నేష‌న‌ల్ లెవెల్‌లో క్రేజ్‌ను అందుకున్న ఈ బ్యూటీ.. కొంత‌కాలంగా సోష‌ల్ మీడియాలో ఓ రేంజ్‌లో రెచ్చిపోతూ గ్లామ‌ర్ పంచుతుంది.

  తాజాగా ఓ హాట్ ఫోటోను పోస్ట్ చేసింది.. త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ ఫోటోలో ఆమె ఓ స్టైలిష్ హాట్ టాప్ వేసుకుని క‌నిపించింది. ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన మౌనీ ఫోటో భారీ స్థాయిలో రెస్పాన్స్ వ‌స్తోంది. మౌనీ రాయ్ చిన్న వయసులోనే మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. పర్‌ఫెక్ట్ ఫిగర్‌తో కనువిందు చేసే ఈ భామ.. అక్కడ తన అందచందాలతో అందరినీ తన వైపునకు తిప్పుకుని మంచి గుర్తింపును దక్కించుకుంది.

  ఈ క్రమంలోనే సుదీర్ఘమైన ప్రయాణంలో పలు బ్రాండ్లకు అంబాసీడర్‌గానూ వ్యవహరించింది. అదే సమయంలో ఎన్నో అందాల పోటీల్లో పాల్గొన్న ఆమె.. అన్నింట్లోనూ తన అందంతో అదరగొట్టేసింది. ఆ సమయంలోనే పలు రకాల వ్యాపార ప్రకటనల్లోనూ నటించి మెప్పించింది. ఆ తర్వాత కథక్ డ్యాన్సర్‌గానూ ఈమె మంచి పేరు సంపాదించింది.

  మౌనీరాయ్ త‌న కెరీర్‌లో కొన్ని చిత్రాల్లోనూ న‌టించింది. ఆరంభంలో స్పెష‌ల్ సాంగ్స్ మాత్ర‌మే చేసిన ఈ బ్యూటీ హీరో హిట్ల‌ర్ ల‌వ్ అనే పంజాబీ చిత్రంలో హీరోయిన్‌గా చేసింది. ఆ త‌ర్వాత గోల్డ్ అనే బాలీవుడ్ సినిమాలో ఆక‌ట్టుకుంది. రోమియో అక్బ‌ర్ వాల్ట‌ర్‌, మేడ్ ఇన్ చైనా వంటి చిత్రాల్లో నటించి ప్రేక్ష‌కుల్లో ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. వీటితో పాటు ఎన్నో మ్యూజిక్ ఆల్బ‌మ్‌లు, వెబ్‌సిరీస్‌ల‌లోనూ న‌టించి మెప్పించింది.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here