ప్ర‌కాశ్‌రాజ్ ప్యానెల్ రాజీనామాల‌పై విష్ణు రియాక్ష‌న్‌..

  61
  0
  manchu family

  మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ఎన్నిక‌ల సంగ‌తి ఏమిటో గాని ఒక‌రిపై ఒక‌రు దూష‌ణ‌లు, విమ‌ర్శ‌లు చేసుకుంటున్నారు. ఎన్నిక‌లు అయింత‌ర్వాత కూడా డైరెక్ట్‌గా, ఇన్‌డైరెక్ట్‌గా మంచు విష్ణు ప్యానెల్, ప్ర‌కాశ్‌రాజ్ ప్యానెల ల స‌భ్యులు విమ‌ర్శ‌లు, ప్ర‌తి విమ‌ర్శ‌లు చేసుకున్నారు. ఎన్నిక‌లు ముగిసిన వెంట‌నే మంచు మోహ‌న్‌బాబు త‌మ‌పై దాడి చేశార‌ని, బూతులు తిట్టార‌ని చెబుతూ ప్ర‌కాశ్‌రాజ్ ప్యానెల్ రాజీనామాలు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.

  అయితే సోమ‌వారం మంచు మోహ‌న్‌బాబు, విష్ణు, ల‌క్ష్మీ ప్ర‌స‌న్న శ్రీ‌వారిని ద‌ర్శించుకున్నారు. ఈ నేప‌థ్యంలో మంచు విష్ణు అక్కడ మీడియాతో మాట్లాడుతూ.. త‌న ప్యానెల్‌లోని ప్ర‌తి స‌భ్యుడు ప‌డ్డ క‌ష్ట‌మే త‌న‌ను గెలిపించిందని అన్నారు. అలాగే త‌న‌కు రెండేళ్ల పాటు మా అసోసియేష‌న్ అభివృద్ధికి సంబంధించిన ప‌నులు చేయ‌డానికి శ‌క్తి సామర్థ్యాలు ఇవ్వాల‌ని ఆ స్వామివారిని కోరుకున్న‌ట్లు తెలిపాడు. ఈ క్ర‌మంలోనే ప్ర‌కాశ్‌రాజ్ ప్యానెల్ స‌భ్యుల రాజీనామాల‌పై మంచు విష్ణు రియాక్ష‌న్ ఎలా ఉందంటే.. ఆ విష‌యం మీడియా ద్వారానే తెలిసింద‌ని, రాజీనామా లేఖ‌లు త‌న వ‌ద్ద‌కు రాలేద‌ని ఆయ‌న అన్నారు.. వ‌చ్చిన త‌ర్వాత స్పందిస్తాన‌ని కూడా మంచు విష్ణు పేర్కొన్నాడు.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here