టీఎఫ్‌సిసిలో 20వేల సినీ కార్మికుల ఆప‌ద్భాంద‌వుడు టీఎఫ్‌సిసి ఛైర్మెన్ డా. ల‌య‌న్ ప్ర‌తానీ రామ‌క్రిష్ణ గౌడ్‌

    74
    0
    lion

    తెలంగాణ సినీ ప‌రిశ్ర‌మకు అండ‌గా, కార్మికుల సంక్షేమ స‌హ‌కారం కోసం ఏర్పాటైన తెలంగాణ ఫిలిం ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ గ‌త 7 సంవ‌త్స‌రాలుగా విజ‌యవంతంగా ముందుకు సాగుతూ 8000 మంది సినీ కార్మికుల‌తో, 800 ప్రొడ్యూస‌ర్స్‌తో, 400 టీ మా ఆర్టిస్టులతో అభివృద్ధి ప‌థంలో న‌డుస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కు టిఎఫ్‌సిసి ద్వారా 140 సినిమాలు సెన్సార్ పూర్తి చేసుకుని రిలీజ్ అయ్యాయి.

    నిర్మాత‌ల‌కు అత్యంత సులువుగా ప్రాసెస్ జ‌రిపే సంస్థ‌గా టిఎఫ్‌సిసి ప్రాచుర్యం పొందింది. లాక్ డౌన్ స‌మ‌యంలో కార్డు ఉన్నా లేక‌పోయినా 20వేల సినీ కార్మికుల‌కు నిత్యావ‌స‌ర స‌రుకులు, ఆర్థిక స‌హాయం అందించడం జ‌రిగింది. అంతేకాకుండా టిఎఫ్‌సిసి ద్వారా ప్ర‌తి సంవ‌త్స‌రం ప‌లు సేవా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌డం జ‌రుగుతోంది.

    ప్ర‌స్తుత ఓటీటీ యుగంలో సినీ రంగంపై ఆస‌క్తి పెంచే దిశ‌గా రెండు తెలుగు రాష్ట్ర‌ ప్ర‌భుత్వాల స‌హ‌కారంతో పెద్ద ఎత్తున సినిమా అవార్డుల ఫంక్ష‌న్‌ను టిఎఫ్‌సిసి ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించ‌నున్నాము. ఇక‌ ప్ర‌స్తుతం 30 మందితో కూడిన‌ టిఎఫ్‌సిసి పాల‌క‌ క‌మిటీ గ‌డువు ముగియ‌నుండ‌టంతో న‌వంబ‌ర్ 14న ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. మ‌రో రెండు రోజుల్లో ఎన్నిక‌ల షెడ్యూల్‌ను ఎల‌క్ష‌న్ ఆఫీస‌ర్ తెలియ‌జేయ‌నున్నారు. ఇట్లు మీ డా.ల‌య‌న్ ప్ర‌తాని రామ‌కృష్ణ‌గౌడ్ ఛైర్మ‌న్ టిఎఫ్‌సిసి.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here