ల‌వ్‌స్టోరీ చిత్ర ఓటీటీ డేట్ వ‌చ్చేసింది..

  66
  0
  nagachaithanya

  నాగ‌చైతన్య‌, సాయిప‌ల్ల‌వి హీరోహీరోయిన్ల్‌గా ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో ల‌వ్‌స్టోరీ తెర‌కెక్కిన విష‌యం తెలిసిందే. ఈ చిత్రం గ‌త నెల‌లో విడుద‌లై బాక్సాఫీస్ వ‌ద్ద ఘ‌న విజ‌యం సాధించి సినీ ప్రేక్ష‌కుల్లో ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ డేట్‌ని చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది. ఆహా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ వేదిక‌గా అక్టోబ‌ర్ 22న సాయంత్రం 6గంట‌ల‌కు స్ట్రీమింగ్ కానుంద‌ని తెలిపింది.

  దీనికి సంబంధించి ఆహా ఓ సరికొత్త ట్రైల‌ర్‌ను రిలీజ్ చేసింది. ఇక ఈ చిత్ర విజ‌యంలో భాగం పంచుకున్న మ్యూజిక్ డైరెక్ట‌ర్ ప‌వ‌న్ సిహెచ్ కాగా.. అమిగోస్ క్రియేష‌న్స్‌, శ్రీ వెంక‌టేశ్వ‌ర సినిమాస్ బ్యాన‌ర్ల‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో రేవంత్ అనే మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుర్రాడిలా నాగచైత‌న్య‌, మౌనిక అనే పెద్దింటి అమ్మాయిగా సాయిప‌ల్ల‌వి న‌టించి మెప్పించారు.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here