“మా”పై సెటైర్ వేసిన ఆర్‌జీవి..

  63
  0
  rgv maa

  నిన్న ఉద‌యం ఫిల్మ్‌న‌గ‌ర్ క‌ల్చ‌ర‌ల్ సెంట‌ర్‌లో మా ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ నూత‌న అధ్య‌క్షుడిగా మంచు విష్ణు ప్ర‌మాణ స్వీకారం చేసిన విష‌యం తెలిసిందే. అయితే దీనిపై వివాదాస్ప‌ద డైరెక్ట‌ర్ రాంగోపాల్‌వ‌ర్మ స్పందించారు. మా అసోసియేష‌న్ లోని మొత్తం వ్య‌వ‌హారం చూస్తుంటే స‌ర్క‌స్‌ని త‌ల‌పించేలా ఉందంటూ వ్యంగ్యాస్రంగా ట్విట్ట‌ర్ ద్వారా తెలిపాడు. ప్ర‌స్తుతం ఈ వ్యాఖ్య‌లు టాలీవుడ్‌లో చ‌ర్చ‌నీయాంశంగా మారాయి.

  ఇక నిన్న మంచు విష్ణుతో పాటు త‌న ప్యానెల్‌లో గెలిచిన 15మంది స‌భ్యులు ప్ర‌మాణ స్వీకారం చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ సినిమాటోగ్ర‌ఫి మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ విచ్చేసి మంచు విష్ణు కో టీమ్‌కీ అభినంద‌న‌లు తెలిపారు. ఈ స‌మావేశంలో డైలాగ్ కింగ్ మోహ‌న్‌బాబు త‌న కొడుకు మంచు విష్ణుతో పాటు గెలిచిన స‌భ్యుల‌కు విషెస్ తెలిపాడు. మ‌రోవైపు.. ఈ ప్ర‌మాణ స్వీకారత్సోవంలో ప‌లువురు న‌టులు ప్ర‌త్య‌ర్థి ప్ర‌కాశ్‌రాజ్ ప్యానెల్‌పై అలాగే వీరికి మ‌ద్ద‌తిచ్చిన వారిపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here