అంతేగా అంతేగా అంటూ ఎఫ్‌3 టీం ద‌స‌రా విషెస్‌..

  133
  0
  f3 team

  విక్ట‌రీ వెంక‌టేశ్‌, మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్‌ కాంబోలో తెరకెక్కిన ఎఫ్‌2 చిత్రం ప్రేక్ష‌కుల‌ను థియేట‌ర్ల‌లో న‌వ్వులూ పూయించింది. అనిల్ రావిపూడి డైరెక్ష‌న్‌లో తెర‌కెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద ఎంతో ఘ‌న‌విజయం సాధించింది. మ‌ళ్లీ ఇప్పుడు వీరి కాంబోలో ఎఫ్‌3 చిత్రం తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. ఇది ఎఫ్‌2 చిత్రానికి సీక్వెల్‌గా రూపుదిద్దుకుంటుండ‌గా.. ఇందులో కూడా వెంక‌టేశ్‌తో మిల్క్‌బ్యూటీ త‌మ‌న్నా, వ‌రుణ్‌తో మెహ్రీన్ లు మ‌రోసారి ప్రేక్ష‌కులను అల‌రించ‌నున్నారు.

  కాగా ఈ రోజు ద‌స‌రా పండ‌గ సంద‌ర్భంగా ఎఫ్‌3 టీం అంతా క‌లిసి ఓ స్పెష‌ల్ వీడియో రూపంలో సినీ ప్రేక్ష‌కుల‌కు ద‌స‌రా శుభాకాంక్ష‌లు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. ఈ వీడియోలో ఎఫ్‌3 సెట్స్‌లో కొన్ని షూటింగ్ విజువ‌ల్స్‌ను చూపించారు.

  అలాగే ఇందులో వెంకీ, వ‌రుణ్‌, త‌మ‌న్నా, మెహ్రీన్‌, అనిల్ రావిపూడి, విజ‌య‌, ప్ర‌గ‌తి త‌దిత‌ర న‌టులు ద‌స‌రా విషెస్ చెబుతూ క‌నిపించారు. ఇక ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తుండ‌గా.. రాక్‌స్టార్ దేవీశ్రీ‌ప్ర‌సాద్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. ఇంకా ఈ సినిమా రిలీజ్ డేట్‌పై క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం ఉంది.

  https://www.youtube.com/watch?v=r_M9FOkl5-A&t=2s

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here