Home Entertainment ట‌క్ జ‌గ‌దీష్‌ను ఓటీటీకు ఎంత‌కు అమ్మేశారో తెలుసా?

ట‌క్ జ‌గ‌దీష్‌ను ఓటీటీకు ఎంత‌కు అమ్మేశారో తెలుసా?

118
0

హీరో నానికి ఎంత మార్కెట్ ఉంది..? దీనికి సమాధానం దాదాపు 30 కోట్లు అని వస్తుంది. ఈయన సినిమాలు విజయం సాధిస్తే కచ్చితంగా 30 నుంచి 35 కోట్ల మధ్యలో షేర్ వసూలు చేస్తాయి. నాలుగేళ్ల‌ కిందే ఎంసీఏ సినిమాతో 40 కోట్ల మార్క్ అందుకున్నాడు నాని. అయితే అప్పుడున్న పరిస్థితులు వేరు. ఇప్పటి పరిస్థితులు వేరు. అందుకే ఇప్పుడు ఎంత పెద్ద సినిమా అయినా కూడా విజయం సాధిస్తే రూ.30 కోట్ల మార్క్ అందుకోవడం కష్టమే. నాని లాంటి హీరో సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే 30 కోట్లు రావడం కష్టమేం కాదు. కానీ ఇప్పుడు ఈయన నటించిన టక్ జగదీష్ సినిమాను ఓటీటీకే అమ్మేశారనే వార్తలు వస్తున్నాయి.

ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియోతో మాటామంతి కూడా పూర్త‌యిపోయాయి కేవలం సంతకాలు పెట్టడం మాత్రమే తరువాయి అనే వార్తలొస్తున్నాయి. అయితే ఇన్ని రోజులు థియేటర్స్ అని కూర్చున్న నిర్మాతలు ఎందుకు మాట తప్పారు.. ఇంత‌కీ అమెజాన్ ఎంత అమౌంట్ ఆఫ‌ర్ చేసింద‌ని ఇప్పుడు అంతా ఆలోచిస్తున్నారు. అయితే ఈ సినిమాకు దాదాపు రూ.37 కోట్ల వ‌ర‌కు డీల్ జ‌రిగింద‌ని తెలుస్తోంది. అది కూడా కేవ‌లం ఓటీటీకి మాత్ర‌మే. అందులో డిజిట‌ల్‌, డ‌బ్బింగ్‌, శాటిలైట్ రైట్స్ లేవు. ఇప్పుడు ఉన్న ప‌రిస్థితుల్లో నాని సినిమా ఒక‌వేళ థియేట‌ర్ల‌లో విడుద‌లై విజ‌యం సాధించినా కూడా రూ.37 కోట్లు వ‌సూలు చేయ‌డం దాదాపు అసాధ్య‌మే. అందుకే నిర్మాత‌లు కూడా ఈ రేటుకే ఓకే చెప్పిన‌ట్లు తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here