Home Entertainment ప్రారంభం కానున్న బంగార్రాజు షూటింగ్‌

ప్రారంభం కానున్న బంగార్రాజు షూటింగ్‌

63
0

అక్కినేని నాగార్జున సూపర్ హిట్ సినిమా ‘సోగ్గాడే చిన్నినాయన’ సీక్వెల్ ‘బంగార్రాజు’ స్క్రిప్టుని పక్కాగా ముస్తాబు చేశారు. నాగచైతన్య -నాగార్జున కలయికలో వస్తోన్న ఈ సినిమా చిత్రీకరణ ఈనెల 20 నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ షూట్ కోసం ఇప్పటికే ప్రత్యేక సెట్‌ కూడా వేశారట. ఈ సెట్‌ లో ముందుగా నాగార్జున, రమ్యకృష్ణల పై కీలక సీన్స్ ను షూట్ చేస్తారట.

ఇక ఈ సినిమాలో నాగచైతన్యకి జోడీగా క్రేజీ హీరోయిన్ కృతిశెట్టి నటించబోతుంది. ‘మనం’ తర్వాత నాగార్జున – నాగచైతన్య కలిసి నటిస్తున్న చిత్రం ఇదే. సంక్రాంతికి విడుదల చేయడమే లక్ష్యంగా ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకి కల్యాణ్‌కృష్ణ కురసాల దర్శకత్వం వహిస్తారు. ‘సోగ్గాడే… ’ చిత్రంతోనే పరిచయమైన కళ్యాణ్ కృష్ణ ‘బంగార్రాజు’తో మళ్ళీ ఫామ్ లోకి వస్తాడేమో చూడాలి. ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here