Home Entertainment మ‌హేష్ లుక్ అదిరింది !

మ‌హేష్ లుక్ అదిరింది !

68
0

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా మూవీ సర్కారు వారి పాట. డైరెక్ట‌ర్‌ పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ చిత్రంలో మహేష్ బాబు సరికొత్త లుక్ లో కనిపించబోతున్నాడు. ఫస్ట్ లుక్ కోసం మహేష్ ఫ్యాన్స్ చాలా రోజులుగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ముందుగా ప్రకటించినట్లుగా చిత్ర యూనిట్ నేడు ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది. ఫస్ట్ లుక్ లో మహేష్ స్టైలిష్ లుక్ తో పాటు, మాస్ యాటిట్యూడ్ అదిరిపోయాయి అని చెప్పాలి. చాలా రోజుల తర్వాత మహేష్ బాబు సరికొత్త హెయిర్ స్టైల్ లో కనిపిస్తున్నాడు.

రెడ్ కారులో డోర్ తీస్తూ మహేష్ కూర్చుని ఉన్న స్టైల్ అదిరిపోయిందనే చెప్పాలి. కారు అద్దాలు కూడా పగిలిపోయి ఉన్నాయి. బహుశా యాక్షన్ సీన్ కి సంబందించిన లుక్ అయి ఉండవచ్చు. మహేష్ లుక్ లో చెవి పోగు, మెడపై టాటూ గమనించవచ్చు.

ముందుగా ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. తాజాగా డేట్ కూడా ఖరారు చేశారు. జనవరి 13న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్లు ఫస్ట్ లుక్ ద్వారా ప్రకటించారు. ఓవరాల్ గా సర్కారు వారి పాట లుక్ అదిరిపోయింది. మహేష్ అభిమానులకు మాస్ ట్రీట్ ముందు ఉంది అని హామీ ఇచ్చేలా లుక్ ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here