Home Entertainment క‌రీనాకు మ‌ద్ద‌తుగా బుట్ట‌బొమ్మ‌

క‌రీనాకు మ‌ద్ద‌తుగా బుట్ట‌బొమ్మ‌

80
0

బుట్ట‌బొమ్మ‌గా ఫేమ‌స్ అయిపోయిన‌ పూజా హెగ్డే వ‌రుస సినిమాల‌తో త‌న స‌త్తా చాటుతోంది. తెలుగులోనే కాక తమిళం, హిందీ భాష‌ల‌లోనూ న‌టిస్తోంది. అయితే సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే పూజా ప‌లు విష‌యాలపై తన‌దైన శైలిలో స్పందిస్తూ ఉంటుంది. తాజాగా రెమ్యున‌రేష‌న్‌కి సంబంధించిన విష‌యంలో క‌రీనాను నెటిజన్స్ ట్రోల్ చేస్తుంటే కరీనాకు స‌పోర్ట్‌గా నిలిచింది ఈ బ్యూటీ.

క‌రీనా క‌పూర్ త్వరలో రానున్న ఓ పాన్‌ ఇండియా మైథలాజికల్‌ సినిమాలో సీత పాత్ర పోషించేందుకు రూ.12 కోట్లు డిమాండ్‌ చేసిందట. ఈ క్ర‌మంలో నెటిజ‌న్స్ ఆమెపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ… కరీనాను ఆ సినిమా నుంచి తొలగించాలంటూ.. ‘బాయ్‌కాట్‌ బెబో’ అనే హ్యాష్‌ ట్యాగ్‌ ట్రెండ్‌ చేశారు. దీంతో ఇండస్ట్రీకి చెందిన పలువురు కరీనాకు మద్దతుగా నిలిచారు.

రీసెంట్‌గా ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడిన పూజా హెగ్డే.. క‌రీనాకు త‌న మార్కెట్ వాల్యూని బ‌ట్టి రెమ్యున‌రేష‌న్ డిమాండ్ చేసి ఉంటుంది. హీరోయిన్ల రెమ్యునరేషన్‌ గురించి మాట్లాడేవారు, హీరోలు పెద్ద మొత్తం డిమాండ్‌ చేస్తే ఎందుకు నోరు మెదపరని ప్రశ్నించింది. రెమ్యున‌రేష‌న్ డిమాండ్ చేయ‌డం న‌టుల హ‌క్కు. అది ఇవ్వాలా వ‌ద్దా అనేది నిర్మాత‌ల ఇష్టాఇష్టాలపై ఆధార ప‌డి ఉంటుందని పూజా తెలిపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here