Home Entertainment భారీ రేటుకు ప‌వ‌న్ – రానా చిత్ర డ‌బ్బింగ్ రైట్స్

భారీ రేటుకు ప‌వ‌న్ – రానా చిత్ర డ‌బ్బింగ్ రైట్స్

94
0

ప్రస్తుతం మన టాలీవుడ్ నుంచి వస్తున్న క్రేజీ మల్టీ స్టారర్ చిత్రాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటిలు నటిస్తున్న చిత్రం కూడా ఒకటి. యువ దర్శకుడు సాగర్ కె చంద్ర తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఇప్పుడు శరవేగంగా షూటింగ్ ను జరుపుకొని సిద్ధం అవుతుంది. అయితే మళయాళ బ్లాక్ బస్టర్ అయ్యప్పణం కోషియం కు రీమేక్ గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ బజ్ వైరల్ అవుతుంది.

ఈ చిత్రం హిందీ డబ్బింగ్ హక్కులు భారీ మొత్తంలో అమ్ముడుపోయాయని ఇపుడు టాక్ నడుస్తుంది. దాదాపు 23 కోట్ల మేర ఈ చిత్రానికి హక్కులు పలికినట్టు టాక్. అయితే ఇందులో ఎలాంటి అధికారిక క్లారిటీ లేదు కానీ సినీ వర్గాల్లో అయితే ఈ మాటే నడుస్తుంది. మరి ఇది ఎంతవరకు నిజమో చూడాలి. ఇంకా ఈ సాలిడ్ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కూడా వర్క్ చేస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here