Home Entertainment ప‌వ‌న్ రానా సినిమా మ‌ళ్ళీ రీ షూట్ చేయ‌నున్నారా?

ప‌వ‌న్ రానా సినిమా మ‌ళ్ళీ రీ షూట్ చేయ‌నున్నారా?

29
0

ప‌వ‌న్ క‌ళ్యాణ్ రానా సినిమా కోసం వర్క్ చేసిన సినిమాటోగ్రాఫర్ ప్రసాద్ మూరెళ్ల ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పనుకున్నట్లు ఈ మధ్య వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగానే ప్రసాద్ ఈ సినిమా నుండి బయటకు వెళ్లారని టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన స్థానంలో తెలుగులో ‘భరత్ అనే నేను’ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించిన రవి కె.చంద్రన్ ను తీసుకున్నారట. అయితే ప్రసాద్ మూరెళ్ల ఆధ్వర్యంలో చిత్రీకరించిన సన్నివేశాలను రీ షూట్ చేయాలని చూస్తున్నారట. ఇదే కనుక నిజమైతే ‘ఏకే’ రీమేక్ మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.

‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ రీమేక్ ని వీలైనంత త్వరగా పూర్తి చేసి క్రిష్ దర్శకత్వంలో చేస్తున్న ‘హరి హర వీరమల్లు’ చిత్రాన్ని తిరిగి స్టార్ట్ చేయాలని పవన్ కళ్యాణ్ ప్లాన్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు రీ షూట్ అంటే.. వీరమల్లు చిత్రీకరణ పై కూడా ప్రభావం చూపుతుంది. ఇకపోతే ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కి.. ‘వీరమల్లు’ 2022 సమ్మర్ కి విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here