Home Entertainment మ‌ళ్ళీ ఆగిన పుష్ప షూటింగ్‌..?

మ‌ళ్ళీ ఆగిన పుష్ప షూటింగ్‌..?

105
0

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ”పుష్ప”. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో లారీ డ్రైవర్ పుష్పరాజ్ పాత్రలో బన్నీ నటిస్తున్నాడు. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ విలన్ గా కనిపించనున్నారు. బన్నీ – సుక్కూ కాంబోలో వస్తున్న ఈ హ్యాట్రిక్ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ – ‘తగ్గేదే లే’ అంటూ వచ్చిన పుష్పరాజ్ టీజర్ అంచనాలను రెట్టింపు చేశాయి.

‘పుష్ప’ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో రెండు భాగాలుగా విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి మొదటి భాగాన్ని ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకున్నారు. అయితే కరోనా ప్రభావం.. షూటింగ్ లేట్ అవ్వడం వంటి కారణాలతో అనుకున్న సమయానికి సినిమా పూర్తి చేసే అవకాశం లేకపోయింది. ఇప్పటికే ‘పుష్ప 1’ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ పూర్తవడంతో.. మిగతా పెండింగ్ వర్క్ కూడా వీలైనంత త్వరగా కంప్లీట్ చేయాలని సుక్కూ అండ్ టీమ్ ప్లాన్ చేసుకున్నారు.

కరోనా సెకండ్ వేవ్ లాక్ డౌన్ తర్వాత ఇటీవలే ‘పుష్ప’ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభించారు. హైదరాబాద్ లో 45 రోజుల పాటు నిర్విరామంగా జరిగే షెడ్యూల్ తో ‘పుష్ప’ పార్ట్-1 చిత్రీకరణ పూర్తి చేయాలని భావించారు. అయితే మళ్ళీ షూటింగ్ కి బ్రేక్ పడిందని వార్తలు వస్తున్నాయి. ఇటీవల హైదరాబాద్ లో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా ‘పుష్ప’ షూటింగ్ స్పాట్ దెబ్బతినిందట. మళ్ళీ బ్రేక్ రావడంతో ఈ షెడ్యూల్ మరికొన్ని రోజులు పొడిగించాల్సి వస్తోందట. ఇందులో నిజమెంతో తెలియాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here