Home Entertainment అఖిల్ కోసం గోస్ట్ ప్రొడ్యూస‌ర్‌గా మారిన నాగార్జున ?

అఖిల్ కోసం గోస్ట్ ప్రొడ్యూస‌ర్‌గా మారిన నాగార్జున ?

132
0

యూత్ కింగ్ అఖిల్ అక్కినేని – స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న స్పై థ్రిల్లర్ మూవీ ”ఏజెంట్”. ఇందులో అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా కోసం అక్కినేని వారసుడు ఏడాదిగా భారీ కసరత్తులు చేసి కండలు తిరిగిన బాడీని రెడీ చేసాడు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాల్లో యువ హీరో ట్రాన్స్ఫర్మేషన్ చూసి అందరూ షాక్ అయ్యారనే చెప్పాలి. ఈ సినిమాతో ఎలాగైనా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడని తెలుస్తోంది. ఇటీవలే ‘ఏజెంట్’ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూట్ స్టార్ట్ అయింది. అయితే అఖిల్ హీరోగా నటిస్తున్న 5వ చిత్రానికి సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో తిరుగుతోంది.

అదేంటంటే ‘ఏజెంట్’ చిత్రానికి కింగ్ అక్కినేని నాగార్జున ఘోస్ట్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారట. ఈ సినిమాలో గ్రాఫిక్స్ వర్క్ కి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందట. చాలా వరుకు స్టూడియోలలోనే షూట్ చేయాల్సి ఉంటుందట. అన్నపూర్ణ స్టూడియోస్ లోనే ఈ పనులన్నీ చేయనున్నారట. దీని కోసం అయ్యే బడ్జెట్ మొత్తం అన్నపూర్ణ స్టూడియోస్ ఖాతాలోకి వెళ్లిపోనుందట. ఏదేమైనా తనయుడు అఖిల్ మీద ఉన్న నెగిటివ్ బజ్ ని ఎలాగైనా పాజిటివ్ గా మార్చడానికి నాగార్జున తనవంతు కృషి చేస్తున్నారని టాక్ న‌డుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here