Home Entertainment ఖుష్బూని క‌మిట్‌మెంట్ అడిగిన హీరో ఎవ‌రు?

ఖుష్బూని క‌మిట్‌మెంట్ అడిగిన హీరో ఎవ‌రు?

24
0

కేవలం తమిళంలోనే కాదు తెలుగులో కూడా ఖుష్బూకు మంచి ఇమేజ్ ఉంది. ఈమె ఇండస్ట్రీకి పరిచయం అయిందే తెలుగు సినిమాతో. 1986లో వెంకటేష్ హీరోగా వచ్చిన కలియుగ పాండవులు సినిమాతో ఇండస్ట్రీకి వచ్చింది ఖుష్బూ. ఆ తర్వాత తెలుగుతో పాటు తమిళంలోనూ చాలా సినిమాలు చేసింది. అక్కడ అభిమానులు ఏకంగా ఆమెకు గుడి క‌ట్టారు. ఇలాంటి హీరోయిన్‌కు ఓ టాలీవుడ్ హీరో నుంచి వేధింపులు ఎదుర‌య్యాయంట‌. త‌న‌ను ఓ అగ్ర హీరో క‌మిట్‌మెంట్ అడిగాడ‌ని.. తాను కూడా మీటూ బాధితురాలినే అని గ‌తంలో చెప్పుకొచ్చింది.

అప్ప‌ట్లో ఓ ప‌ల్లెటూరిలో సినిమా షూటింగ్‌ జ‌రుగుతున్న‌పుడు ఈ ఇష్యూ జ‌రిగింద‌ని గుర్తు చేసుకుంది. ఓ రోజు సాయంత్రం షూటింగ్ పూర్త‌యి తాను మేడ మీదకు వెళ్తున్న స‌మ‌యంలో అక్క‌డే ఉన్న ఓ వ్య‌క్తి త‌న వెన‌క ట‌చ్ చేశాడ‌ని.. దాంతో వెంట‌నే ఎవ‌ర‌ని చూసుకోకుండా చెంప వాయించాన‌ని చెప్పింది ఈ భామ‌. మెట్లెక్కుతున్నప్పుడు వెనుక నుంచి అసభ్యంగా తాకేస‌రికి.. త‌న‌కు కోపం ఆగ‌లేద‌ని చెప్పింది. తాను కొట్టిన స‌మ‌యంలో నిర్మాత సురేశ్ బాబు.. ఇత‌రులు కూడా అక్క‌డే ఉన్నార‌ని.. అంతా త‌న‌కే అండ‌గా ఉన్నార‌నే విష‌యాన్ని గుర్తు చేసుకుంది ఖుష్బూ. ఇదే త‌న‌కు ఎదురైన తొలి మీటూ అనుభ‌వం అంటుంది ఈ సీనియ‌ర్ హీరోయిన్.

ఆ త‌ర్వాత కూడా ఇలాంటి వేధింపులు కొన్ని ఎదుర‌య్యాయ‌ని చెప్పింది. అంతేకాదు ఓ హీరో తనను కమిట్‌మెంట్‌ అడిగితే.. తన కూతురును తమ్ముడి గదికి పంపిస్తే తాను ఒప్పుకుంటానంటూ రివర్స్ కౌంటర్ ఇచ్చినట్లు చెప్పింది ఖుష్బూ. దాంతో ఆ హీరో నోరు మూసుకున్నాడని తెలిపింది. ఇక త‌న‌కు ఆ స‌మ‌యంలో వ‌చ్చిన ల‌వ్ లెట‌ర్స్ గురించి కూడా నోరు విప్పింది ఖుష్బూ. ఆశ్చ‌ర్యం ఏంటంటే ఇప్ప‌టికీ త‌న‌కు కొందరు లవ్ ప్రపోజ్ చేస్తుంటారని చెబుతుంది ఖుష్బూ. అయితే అది త‌న భ‌ర్త సుందర్ కూడా తన మొదటి సినిమా దర్శకత్వం సమయంలోనే ప్రేమ గురించి చెప్పాడ‌ని.. అత‌డిలో ఉన్న నిజాయితీ న‌చ్చి వెంట‌నే ఓకే చేశాన‌ని చెప్పింది ఈ భామ‌. మొత్తానికి కమిట్మెంట్ గురించి చెప్పినా.. అడిగింది ఎవరనేది మాత్రం చెప్పలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here