Home Entertainment షూటింగ్‌కు ముందు త‌మ‌న్నా సెట్స్‌లో ఏం చేసిందో తెలుసా..?

షూటింగ్‌కు ముందు త‌మ‌న్నా సెట్స్‌లో ఏం చేసిందో తెలుసా..?

124
0

త‌న ఫాలోవ‌ర్లు, ఫ్యాన్స్ కు ప్ర‌తీ రోజు ఏదో ఒక అప్ డేట్ ఇస్తూ ఉంటుంది త‌మ‌న్నా. సోష‌ల్ మీడియాలో చురుకుగా ఉండే ఈ మిల్కీ బ్యూటీ కొన్ని వారాల క్రితం క్వారంటైన్ స్టోరీల‌ను షేర్ చేసింది. ఇక ఇపుడేమో లాక్ డౌన్ ముగిసి…షూటింగ్స్ మొద‌ల‌వ‌డంతో వాటికి సంబంధించిన అప్ డేట్ ను షేర్ చేసుకుంది. మంగ‌ళ‌వారం సినిమా లొకేష‌న్ లో ఓ చేతిలో కాఫీ, మ‌రో చేతిలో కేక్ ప‌ట్టుకున్న స్టిల్ పోస్ట్ చేసింది.

షూటింగ్ కు ముందు అల్పాహారం కోసం కేక్ అంటూ క్యాప్ష‌న్ ఇచ్చింది. ఈ ఫొటో వైర‌ల్ కావ‌డంతో..టేస్టీ, బ్యూటీఫుల్‌, వావ్ అంటూ తెగ కామెంట్లు పెట్టారు నెటిజ‌న్లు. త‌మ‌న్నా, గోపీచంద్‌తో క‌లిసి న‌టించిన సీటీమార్ విడుద‌ల కావాల్సి ఉంది. మ‌రోవైపు తెలుగులో ఎఫ్3, అంధాధున్, గుర్తుందా శీతాకాలం, హిందీలో బోలే చుడియాన్ సినిమాలు చేస్తోంది. వెబ్ ప్రాజెక్టుల్లో కూడా న‌టిస్తూ బిజీ హీరోయిన్ గా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here