Home Entertainment వైష్ణ‌వ్‌తేజ్‌తో సురేంద‌ర్‌రెడ్డి సినిమా

వైష్ణ‌వ్‌తేజ్‌తో సురేంద‌ర్‌రెడ్డి సినిమా

41
0

‘ఉప్పెన’తో బ్యాంగ్ బ్యాంగ్ ఎంట్రీ ఇచ్చిన పంజా వైష్ణవ్ తేజ్‌తో సురేందర్ ఓ సినిమా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. తన మేనల్లుళ్ల కెరీర్ విషయంలో పవన్ ఎంత శ్రద్ధ వహిస్తాడో తెలిసిందే. మధ్యలో గాడి తప్పిన తేజు కెరీర్‌ మళ్లీ గాడిన పడటంలో పవన్ పాత్ర కీలకమని అంటారు. వైష్ణవ్ సినిమాల విషయంలోనూ ఆయన పాత్ర ఉంటున్నట్లు ఇండస్ట్రీలో చెబుతుంటారు. పవన్‌తో సినిమాకు ముందు వైష్ణవ్‌తో సినిమా చేస్తే సురేందర్‌కు అది కలిసొస్తుందనడంలో సందేహం లేదు.

మిగతా యువ కథానాయకులకు భిన్నంగా తొలి సినిమాలో ప్రయోగాత్మక పాత్రతో అందరి మనసులూ గెలిచాడు వైష్ణవ్. ఆ తర్వాత కూడా క్రిష్ దర్శకత్వంలో ఓ వైవిధ్యమైన సినిమా చేశాడు. ప్రస్తుతం ‘అర్జున్ రెడ్డి’ తమిళ రీమేక్ దర్శకుడు గిరీశయ్యతో ఓ సినిమా చేస్తున్నాడు. దీని తర్వాత నాగార్జున నిర్మాణంలో ఓ సినిమా ఉంటుందంటున్నారు. వీటితో పాటు సురేందర్ సినిమాలోనూ అతను నటించనున్నట్లు చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here