Home Entertainment రెమ్యున‌రేష‌న్ విష‌యంలో త‌గ్గేదే లే అంటోన్న పూజా హెగ్డే

రెమ్యున‌రేష‌న్ విష‌యంలో త‌గ్గేదే లే అంటోన్న పూజా హెగ్డే

46
0

పూజా హెగ్డే.. వ‌రుస్ హిట్ల‌తో ఇండ‌స్ట్రీలో టాప్ హీరోయిన్‌గా కొనసాగుతున్న ఈమె ఈ మ‌ధ్య‌ సినిమాలతో బిజీ బిజీగా గడుపుతుంది. ఈ సుంద‌రిని తమ సినిమాలో హీరోయిన్‌గా తీసుకునేందుకు టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ద‌ర్శ‌క నిర్మాతలు క్యూ కడుతున్నారంటే ఈ అమ్మడు క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిన పూజా ఓ విషయంలో మాత్రం నో కాంప్రమైజ్ అంటున్నారు..

తెలుగు ఇండస్ట్రీలో తనకున్న గ్రేస్‌ను బట్టి పెద్ద మొత్తంలో పారితోషికాన్ని తీసుకుంటున్న పూజా అందులో కొంచెం కూడా తగ్గించేందుకు ఒప్పుకోవ‌ట్లేద‌ట‌. ఇటీవల ఓ పెద్ద సినిమా నిర్మాణ సంస్థ కూడా పూజాహెగ్డేను రెమ్యున‌రేష‌న్ కొంత త‌గ్గించుకోవాల‌ని రిక్వెస్ట్ చేసినప్పటికి ఆమె ఆ విషయంలో నో కాంప్రమైజ్ అని తెగేసి చెప్పినట్టు సినీ వ‌ర్గంలో వినికిడి. ఇదిలా ఉంటే ప్రస్తుతం పూజా రాధేశ్యామ్‌, ఆచార్య‌, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్ వంటి సినిమాల్లో నటిస్తూ స‌క్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here