Home Entertainment ఎన్నిక‌ల హీట్ పెంచుతోన్న ప్ర‌కాష్ రాజ్‌

ఎన్నిక‌ల హీట్ పెంచుతోన్న ప్ర‌కాష్ రాజ్‌

153
0

టాలీవుడ్‌లో ‘మా’ ఎన్నికల వేడి ఏ విధంగా రాజుకుంటుందో తెలుస్తూనే ఉంది. ఇప్పటికే నలుగురు ‘మా’ అధ్యక్ష పదవి కోసం బరిలోకి దిగుతున్నట్లుగా ప్రకటించారు. ఇప్పటి వరకు ప్రకాశ్‌ రాజ్‌, మంచు విష్ణు, జీవితా రాజశేఖర్‌, హేమ ఈ పోటీకి సిద్ధమవుతున్నట్లుగా ప్రకటించారు. తాజాగా ప్రకాశ్‌ రాజ్‌ తన ప్యానెల్‌ని కూడా ప్రకటించారు. ”త్వరలో జ‌ర‌గ‌బోయే మా ఎల‌క్షన్స్‌ని పుర‌స్కరించుకుని, ‘మా’ శ్రేయ‌స్సు దృష్ట్యా.. నిర్మాణాత్మక ఆలోచ‌న‌ల‌ని ఆచ‌ర‌ణ‌లో పెట్టే దిశ‌గా మా ప్రతిష్టకోసం.. మ‌న న‌టీనటుల బాగోగుల కోసం.. సినిమా న‌టీన‌టులంద‌రి ఆశీస్సుల‌తో.. అండ‌దండ‌ల‌తో.. ఎన్నిక‌ల‌లో నిల‌బ‌డటం కోసం.. ప‌ద‌వులు కాదు ప‌నులు మాత్రమే చేయ‌డం కోసం.. ‘మా’ టీంతో రాబోతున్న విష‌యాన్ని తెలియ‌ప‌రుస్తున్నాం..” అని చెబుతూ.. ప్రకాష్‌రాజ్ తన ప్యానెల్‌ సభ్యుల వివరాలను విడుదల చేశారు. సిని’మా’ బిడ్డలు అనే ప్యానెల్‌తో ప్రకాశ్‌ రాజ్‌ రివీల్‌ చేసిన ప్యానెల్‌లోని సభ్యులు వీరే.

  1. ప్రకాష్‌రాజ్‌
  2. జ‌య‌సుధ‌
  3. శ్రీకాంత్‌
  4. బెన‌ర్జీ
  5. సాయికుమార్‌
  6. తనీష్‌
  7. ప్రగ‌తి
  8. అన‌సూయ‌
  9. స‌న
  10. అనితా చౌద‌రి
  11. సుధ‌
  12. అజ‌య్‌
  13. నాగినీడు
  14. బ్రహ్మాజీ
  15. ర‌విప్రకాష్‌
  16. స‌మీర్‌
  17. ఉత్తేజ్
  18. బండ్ల గణేష్
  19. ఏడిద శ్రీరామ్‌
  20. శివారెడ్డి
  21. భూపాల్‌
  22. టార్జాన్‌
  23. సురేష్ కొండేటి
  24. ఖ‌య్యుం
  25. సుడిగాలి సుధీర్
  26. గోవింద‌రావు
  27. శ్రీధ‌ర్‌రావు

మ‌రికొంద‌రు ప్రముఖులు ఉన్నట్లుగా ప్రకాశ్‌ రాజ్‌ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here