Home Entertainment ర‌ష్మిక కోసం సాహ‌సం చేసిన యువ‌కుడు

ర‌ష్మిక కోసం సాహ‌సం చేసిన యువ‌కుడు

45
0

కన్నడ హాట్ బ్యూటీ రష్మిక మందన్నను ఎలాగైనా కలవాలని ఆమె వీరాభిమాని డిసైడ్ అయ్యాడు. హైదరాబాద్ లో రష్మిక మందన్నను కలవడానికి ఆ వీరాభిమాని అనేక ప్రయత్నాలు చేశాడు. కరోనా వైరస్, లాక్ డౌన్ కారణంగా షూటింగ్ లు పూర్తిగా నిలిపివేయడంతో రష్మికను కలవడం అతనికి సాధ్యం కాలేదు. అంతే రైలులో మైసూరు చేరుకున్న ఆ వీరాభిమాని తరువాత రష్మిక తండ్రి ఇంటి దగ్గరకు వెళ్లడానికి ప్రయత్నించాడు. గూగుల్ లో సెర్చ్ చేసిన గూగుల్ తల్లి సూచనలతో ఆ వీరాభిమాని ఓ చోటకు వెళ్లి రష్మిక ఇల్లు ఎక్కడ ?, ఆమె ఎక్కడున్నారు ?, ఏమి చేస్తున్నారు ? అంటూ ఆరా తీశాడు. మనోడి దెబ్బతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. వీరాభిమాని చెప్పిన మాటలకు స్థానికులు బిత్తరపోయారు.

గూగుల్ లో రష్మిక మందన్న ఎక్కడ ఉంటుంది ? అని ఆకాశ్ త్రిపాఠి వెతకడం మొదలుపెట్టాడు. కర్ణాటకలోని వీరాజపేటలో రష్మిక మందన్న సొంత ఇల్లు ఉందని ఆమె వీరాభిమాని ఆకాశ్ త్రిపాఠి తెలుసుకున్నాడు. అంతే రైలు ఎక్కిన ఆకాశ్ త్రిపాఠి నేరుగా కర్ణాటకలోని మైసూరు సిటీకి చేరుకున్నాడు.

గూగుల్ మ్యాప్ లో చూపించిన తోటలోని ఇంటి దగ్గరకు వెళ్లిన ఆకాశ్ త్రిపాఠి రష్మిక మందన్న ఎక్కడ ?, ఆమె ఎక్కడున్నారు ?, షూటింగ్ లు లేవు కదా, ఆమె ఏం చేస్తున్నారు ? అంటూ స్థానికులను రకరకాలుగా ప్రశ్నించాడు. వీడెవడో వచ్చేశాడు అంటూ బిత్తరపోయిన స్థానికులకు అనుమానం వచ్చి సీక్రెట్ గా పోలీసులకు సమాచారం ఇచ్చి వారిని పిలిపించారు.

హీరోయిన్ రష్మిక మందన్న మగ్గుల ఊర్లో కాకుండా వీరాజపేటలో ఉంటున్నది. పోలీసులు బుద్దిమాటలు చెప్పి ఆకాశ్ ను మళ్లీ మైసూరుకు పంపించి అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్లిపోవాలని సూచించారు. ఆకాశ్ కు కన్నడ బాష రాకపోవడం నానా తంటాలు పడి రష్మిక మందన్నను కలవడానికి అవకాశం లేకపోవడంతో నిరాశగా మళ్లీ తెలంగాణ బయలుదేరాడని స్థానికులు అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here