Home Entertainment షూటింగ్ కి రెడీ అయిన‌ నాగ‌శౌర్య 22వ సినిమా

షూటింగ్ కి రెడీ అయిన‌ నాగ‌శౌర్య 22వ సినిమా

66
0

వరుస సినిమాలతో దూకుడుమీదున్న యువ హీరో నాగశౌర్య.. తన 22వ చిత్రాన్ని హోమ్ బ్యానర్ ఐరా క్రియేషన్స్ లో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో షిర్లీ సెటియా హీరోయిన్ గా నటిస్తోంది. ‘అలా ఎలా’ ఫేమ్ అనీష్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఆ మధ్య శౌర్య ఇతర సినిమాలతో బిజీగా ఉండటంతో.. అనీష్ ‘గాలి సంపత్’ దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నాడు. ఈ సినిమా ప్లాప్ అవ్వడంతో నాగశౌర్య సినిమా ఉంటుందా లేదా అని వార్తలు వచ్చాయి.

అయితే ‘గాలి సంపత్’ సినిమా రిజల్ట్ ని పట్టించుకోకుండా అనీష్ తోనే తన హోమ్ ప్రొడక్షన్ లో నాల్గవ సినిమా చేయాలని నాగశౌర్య నిర్ణయించుకున్నారట. ఈ నేపథ్యంలో స్క్రిప్ట్ పై మరోసారి కూర్చొని.. రీ వర్క్ చేస్తున్నారట. త్వరలోనే ఈ సినిమాను రీస్టార్ట్ చేయడానికి యంగ్ హీరో సన్నాహాలు చేసుకుంటున్నాడని తెలుస్తోంది. శంకర్ ప్రసాద్ మల్పూరి సమర్పణలో ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై ఉషా మల్పూరి NS22 చిత్రానికి సాగర్ మహతి సంగీతం సమకూరుస్తుండగా.. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ సినిమాలో సత్య – రాహుల్ రామకృష్ణ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇకపోతే నాగశౌర్య ‘లక్ష్య’ అనే స్పోర్ట్స్ డ్రామా షూటింగ్ పూర్తి చేశాడు. ‘వరుడు కావలెను’ ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ సినిమాలతో పాటుగా ‘పోలీసు వారి హెచ్చరిక’ అనే చిత్రాన్ని లైన్ లో పెట్టాడు. ఈ క్రమంలో శ్రీమాన్ దర్శకత్వంలో ‘#NS24’ సినిమా చేయనున్నాడు.ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here