Home Entertainment ఆ ప‌త్రిక‌క‌పై ర‌కుల్ ఫైర్‌

ఆ ప‌త్రిక‌క‌పై ర‌కుల్ ఫైర్‌

61
0

ప్రస్తుతం టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్‌లో పలు ప్రాజెక్ట్స్‌కు సంతకం చేసిన రకుల్‌ చేతిలో ఇప్పుడు దాదాపు 6 సినిమాలు ఉన్నాయి. లాక్‌డౌన్‌ కారణంగా ఈ ఆ సినిమా షూటింగ్స్‌ వాయిదా పడటంతో ఆమె ఇంట్లో విశ్రాంతి తీసుకుంటుంది. ఇదిలా ఉండగా ఇటీవల ఓ ఆంగ్ల పత్రిక టాలీవుడ్‌లో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కెరీర్‌ ముగిసిందని, ప్రస్తుతం ఆమెకు అక్కడ సినిమాలు రావడంలేదని రకుల్‌ స్వయంగా చెప్పినట్లు ఆ పత్రిక రాసుకొచ్చింది. దానిపై ఆమె స్పందిస్తూ.. ‘నాకు చాలా ఆశ్చర్యం ఉంది. మీరు పెట్టిన హెడ్డింగ్‌ ప్రకారం టాలీవుడ్‌లో నాకు అవకాశాలు రావడం లేదని నేనేప్పుడు చెప్పాను?. అసలు ఏడాదికి సాధారణంగా ఎన్ని సినిమాలు చేయగలం? 365 రోజుల్లో ఇప్పుడు నేను 6 సినిమాలు చేస్తున్నాను. అంటే ఒక్క ఎడాదికి ఇవి సరిపోవా? అలా అయితే కొత్త ఆఫర్స్‌ కోసం దయచేసి నా డేట్స్‌ సర్దుబాటు చేయండి. ఒకవేళ మీరు అలా చేయగలిగితే మా టీమ్‌కి సాయం చేయండి’ అంటూ రకుల్‌ ఆ పత్రికపై అసహనం వ్యక్తం చేసింది.

అది చూసిన డైరెక్టర్‌ హరీశ్‌ శంకర్‌ రకుల్‌ ట్వీట్‌పై స్పందించాడు. ‘షూటింగ్స్‌తో ఎంత బిజీగా ఉన్నావో నాకు తెలుసు రకుల్‌.. ఇటీవల నా స్నేహితుడు రాసిన స్క్రిప్ట్‌ నీకు బాగా నచ్చింది. దీంతో ఈ ప్రాజెక్ట్స్‌ కోసం నీ డేట్స్‌ సర్దుపాటు ​చేయడానికి నువ్వు ఎంతగా ప్రయత్నించావో తెలుసు. అది కుదరకపోవడంతో చివరకు ఆ ప్రాజెక్ట్‌ను వాయిదా పడింది. నువ్వు ఇలాగే నీ సినిమాలతో ఇలాంటి వాటికి సమాధాం చెప్పు’ అంటూ రకుల్‌కు శంకర్‌ మద్దుతునిచ్చాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here