Home Entertainment షూగింగ్ మ‌ళ్ళీ మొద‌లెట్టిన ఆర్ ఆర్ ఆర్‌

షూగింగ్ మ‌ళ్ళీ మొద‌లెట్టిన ఆర్ ఆర్ ఆర్‌

60
0

రాజమౌళి ఆర్ ఆర్ ఆర్‌ మూవీ ప్రకటించిన‌ప్పటినుంచే ఆ సినిమాపై ఓ రేంజ్ అంచనాలు క్రియేట్ అయ్యాయి. యంగ్ స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ తెరపంచుకోనుండటం టాలీవుడ్ ప్రేక్షకులను మరింత ఆకర్షించింది. ఆ సమయం ఎప్పుడొప్పుడు వస్తుందా అని అటు మెగా ఫ్యాన్స్, ఇటు నందమూరి ఫ్యాన్స్ కళ్ళలో వత్తులు వేసుకొని చూస్తున్నారు. అయితే కరోనా మహమ్మారి వారి ఆశలపై నీళ్లు చల్లుతూ వచ్చింది. కరోనా ఎఫెక్ట్‌తో ఇప్పటికే చాలా సార్లు ఈ మూవీ షూటింగ్ వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో రీసెంట్‌గా సెకండ్ వేవ్ కారణంగా వచ్చిన బ్రేక్‌కి ఇక ఫుల్‌స్టాప్ పడిందని తెలుపుతూ మెగా, నందమూరి అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు చెర్రీ హెయిర్ స్టైలిస్ట్ ఆలిమ్ హకీమ్.

కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా ఆగిన RRR షూటింగ్‌ను ఇటీవ‌ల‌ హైద‌రాబాద్‌లో స్టార్ట్ చేసినట్టు తెలుపుతూ రామ్ చరణ్‌తో దిగిన లేటెస్ట్ పిక్ పోస్ట్ చేశాడు ఆలిమ్ హకీమ్. లాక్‌డౌన్ 2.0 సడలింపులు ఇవ్వడంతో తిరిగి సినిమా షూటింగ్స్ మొదలయ్యాయని, రామ్‌చ‌ర‌ణ్‌కు హెయిర్ స్టైల్ చేయ‌డం ద్వారా తన రోజు ప్రారంభించినట్లు ఆయన పేర్కొన్నారు. అంటే మిగిలిన కొంత భాగం షూట్ కంప్లీట్ చేసి చెప్పిన తేదీకే RRR విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here