Home Entertainment గోవాలో పుష్ప‌రాజ్

గోవాలో పుష్ప‌రాజ్

455
0

టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న యాక్షన్ డ్రామా మూవీ పుష్ప. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమా అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతుంది. అయితే ఈ పాన్ ఇండియా యాక్షన్ సినిమా ఇదివరకు తూర్పుగోదావరి జిల్లాలోని మారేడుమిల్లి అడవుల్లో.. కేరళ అడవుల్లో షూటింగ్ షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. ఇప్పటివరకు జరిగిన షెడ్యూల్ రషెస్ చూసి డైరెక్టర్ సుకుమార్ చాలా సంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తుంది. తనకు కావాల్సిన అవుట్ ఫుట్ రాబట్టుకోవడంలో డైరెక్టర్ సుకుమార్ దిట్ట అనే సంగతి తెలిసిందే.

అలాంటిది రషెస్ చూసి సాటిస్ఫాక్షన్ చెందాడంటే యాక్షన్ ఏ రేంజిలో ఉంటుందో అంచనా వేసుకోవచ్చు. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నటువంటి చిత్రబృందం వెంటనే మరో షెడ్యూల్ కు రెడీ అవుతున్నారు. లాక్డౌన్ ముగియడంతో షూటింగ్స్ అన్ని మొదలవుతున్నాయి. సో పుష్ప బృందం కూడా వీలైనంత త్వరగా షూటింగ్ ప్రారంభించే ప్రణాళిక సిద్ధం చేస్తోందట. అయితే ఈసారి షెడ్యూల్ గోవాలో ప్లాన్ చేసినట్లు సమాచారం. 30రోజుల పాటు జరుపనున్న ఈ షెడ్యూల్లో కీలక యాక్షన్ ఘట్టాలతో పాటుగా పుష్పారాజ్ ఇంట్రడక్షన్ సాంగ్ కూడా షూట్ చేయనున్నట్లు తెలుస్తుంది. ఆల్రెడీ సుకుమార్ బృందం అద్భుతమైన లొకేషన్స్ కూడా సెలెక్ట్ చేసి పెట్టారట.

పాన్ ఇండియా రేంజిలో రూపొందుతున్న ఈ సినిమా రెండు భాగాలుగా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ లారీడ్రైవర్ గా కనిపించనున్నాడు. అలాగే ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తుంటాడని ఇంట్రడక్షన్ వీడియో చూస్తే అర్ధమవుతుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నటువంటి ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. రష్మిక మందన ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అయితే సుకుమార్ – బన్నీ – దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్ వస్తున్న మూడో సినిమా కాబట్టి హ్యాట్రిక్ హిట్ కొడతారని ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. దేశవ్యాప్తంగా ఐదు భాషల్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here