Home Entertainment ఇంకా తేల‌ని సీత కాంట్ర‌వ‌ర్సీ

ఇంకా తేల‌ని సీత కాంట్ర‌వ‌ర్సీ

62
0

విజయేంద్రప్రసాద్ ఎప్పుడూ చేతినిండా రైటింగ్ పనితో బిజీగా ఉంటారని అర్ధమవుతుంది. అయితే ఇటీవలే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ప్రధానపాత్రలో విజయేంద్రప్రసాద్ రామాయణం ఆధారంగా సీత అనే కథను సిద్ధం చేసిన విషయం తెలిసిందే. ఆల్రెడీ కరీనా కపూర్ తో సీత క్యారెక్టర్ కోసం మేకర్స్ చర్చలు కూడా జరిపారు. ఆమె కూడా ఈ సినిమా చేసేందుకు సానుకూలంగానే స్పందించినట్లు టాక్ వచ్చింది. రామాయణ ఇతిహాసంలో రాముడి భార్య అయిన సీత కోణంలో ఈ సినిమాను ప్లాన్ చేశారు.

అదిగాక కరీనా సీత క్యారెక్టర్ చేసేందుకు కండిషన్లు కూడా పెట్టిందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా కోసం దాదాపు 12 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ఆమె డిమాండ్ చేసినట్లు ప్రచారం జరిగింది. సాధారణంగా కరీనా కపూర్ ప్రతి సినిమాకు ఆరు నుంచి ఎనిమిది కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. కానీ సీత సినిమా చేయడం కోసం వీలైనన్ని ఎక్కువ డేట్స్ కేటాయించాల్సి వస్తుందని.. అందుకే ఆమె దాదాపు డబుల్ ఛార్జ్ చేస్తున్నట్లు వార్తలొచ్చాయి. ఈ సినిమాకు అలౌకిక దేశాయ్ దర్శకత్వం వహించనున్నాడు.

అయితే తాజాగా ఈ సినిమాలో కరీనా క్యారెక్టర్ పై సోషల్ మీడియాలో పలు పుకార్లు వినిపిస్తున్నాయి. కరీనా బదులుగా సీత క్యారెక్టర్ లో కంగనాను తీసుకోవాలని నెటిజన్లు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం కరీనా సినిమాలు చేయక చాలారోజులు అయింది. అలాగే సౌత్ ప్రేక్షకులకు కరీనా అంతగా పరిచయం కాలేదు. కానీ కంగనా మాత్రం మణికర్ణికతో పాటు త్వరలో తలైవి సినిమాతో క్రేజ్ తెచ్చుకోబోతుంది. సో కంగనాను సెలెక్ట్ చేసుకుంటే సినిమాకు సౌత్ నార్త్ లో అనుకున్న బిజినెస్ జరుగుతుందని టాక్ నడుస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here