Home Entertainment హీరో విశాల్‌కు తృటిలో త‌ప్పిన ప్ర‌మాదం

హీరో విశాల్‌కు తృటిలో త‌ప్పిన ప్ర‌మాదం

68
0

విశాల్ హీరోగా ఇటు కోలీవుడ్ అటు టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. విశాల్ ప్రస్తుతం కొత్త కొత్త కథలను ఎంచుకుంటూ ఆడియన్స్ ముందుకు వస్తున్నారు. అయితే చివరగా చక్ర అంటూ వచ్చిన విశాల్ అంతగా మెప్పించలేకపోయారు. అంతకు ముందు వరుస హిట్లతో విశాల్ దూసుకుపోయారు. డిటెక్టివ్, అభిమన్యు, పందెం కోడి 2 అంటూ సూపర్ హిట్లను అందుకున్నారు. అయితే విశాల్ ఇప్పుడు పలు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. డిటెక్టివ్ సీక్వెల్ పనుల్లోనూ విశాల్ రచ్చ చేస్తున్నారు. మిస్కిన్ తప్పుకోవడం దర్శకత్వ బాధ్యతలను విశాల్ భుజానికెత్తుకున్నారు.

తాజాగా విశాల్ ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌లో పాల్గొన్నారు. అయితే ఇందులో తృటిలో తనకు ప్రమాదం తప్పినట్టు తెలుస్తోంది. అదృష్టవశాత్తు తప్పించుకున్నానని విశాల్ చెప్పుకొచ్చారు. స్టంట్ ఆర్టిస్ట్‌ల తప్పేమీ లేదు.. జస్ట్ టైమింగ్ మిస్.. యాక్షన్ సీక్వెన్స్‌లో ఇలాంటివి జరుగుతుంటాయి. దేవుడి దయ, మీ ప్రేమతో బ్యాక్ టు బ్యాక్ షూటింగ్ చేశాం.. ఫైట్ సీక్వెన్స్ చేసేశాం.. హైద్రాబాద్‌లోనే షూటింగ్ జరుగుతోంది. యాక్షన్ సీక్వెన్స్‌ను ఇంత అద్బుతంగా తెరకెక్కించినందుకు థ్యాంక్స్ టు రవివర్మ మాస్టర్ అని చెప్పుకొచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here