Home Entertainment తానే స్వ‌యంగా ఫోన్ చేసి అభిమానిని ప‌ల‌క‌రించిన చిరు

తానే స్వ‌యంగా ఫోన్ చేసి అభిమానిని ప‌ల‌క‌రించిన చిరు

185
0

తూర్పు గోదావ‌రి జిల్లా అమలాపురంలో ఉన్న అభిమానికి మెగాస్టార్ చిరంజీవి ఫోన్ చేశారు. చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకును సొంత ఇంటిలో నిర్వ‌హించిన‌ న‌ల్లా శ్రీధర్ అనే అభిమానికి స్వ‌యంగా ఫోన్ చేసి అభినందించారు మెగాస్టార్. మ‌హ‌మ్మారి క‌రోనా వ్యాప్తి సమయంలో చేస్తున్న సేవలపై ప్రశంసలు గుప్పించారు. ఆక్సిజన్ బ్యాంకును సొంత ఇంటిలో నిర్వహించడం గొప్ప నిర్ణ‌య‌మ‌న్నారు. అభిమానులు ఇలా సేవ చేయ‌డం త‌న మ‌న‌సుకు ఎంతో ఆనందక‌రమన్నారు. మున్ముందు ఇంకా మంచి ప‌నులు చేయాలంటూ శ్రీధ‌ర్‌కు సూచించారు మెగాస్టార్. కరోనా ఉధృతి తగ్గిన తరువాత హైదరాబాద్ వ‌చ్చి క‌ల‌వాల‌ని శ్రీధ‌ర్‌ను చిరు కోరారు.

క‌రోనా క్రైసిస్ చారిటీ సేవ‌ల అనంత‌రం మెగాస్టార్ చిరంజీవి మరో మెగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విష‌యం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో చిరంజీవి చారిట‌బుల్ ట్ర‌స్ట్ ఆక్సిజ‌న్ బ్యాంకులు ఏర్పాటు చేశారు. జిల్లాల్లో ఆస్ప‌త్రి నుంచి ఆక్సిజ‌న్ కావాల‌ని కోర‌గానే సిలిండ‌ర్ల‌ను పంపిస్తున్నారు. అవ‌స‌రాన్ని బ‌ట్టి ఈ పంపిణీ జరుగుతుంది. ఆక్సిజన్ సంక్షోభాన్ని అరికడుతూ ఆంధ్రప్రదేశ్- తెలంగాణ రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరత వల్ల ఏ ఒక్కరూ చ‌నిపోకూడ‌ద‌న్న‌ ఉద్దేశంతో చిరంజీవి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెలుగువారందరికీ ఈ ఆక్సిజ‌న్ బ్యాంక్స్ అందుబాటులో ఉంటాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here