Home Entertainment కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆత్మ నిర్భర్ పథకంపై అసంతృప్తిని వ్య‌క్తం చేసిన కేటీఆర్

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆత్మ నిర్భర్ పథకంపై అసంతృప్తిని వ్య‌క్తం చేసిన కేటీఆర్

70
0

కరోనా కష్టకాలంలో పరిశ్రమలను ఆదుకునేందకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆత్మ నిర్భర్ పథకం అమలు తీరుతోపాటు దాని వల్ల చిన్న పరిశ్రమలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పేర్కోంటూ కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్‌కు మంత్రి కేటిఆర్ లేఖ రాశారు. మారుతున్న పరిణామాలకు అనుగుణంగా రాష్ట్రాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్యాకేజిలో మార్పులు చేయాల్సిందిగా ఆయన కోరారు.

కేటిఆర్ రాసిని లేఖ పూర్తి సారాంశం ఈ విధంగా ఉంది……కరోనా సంక్షోభానికి ప్రభావితమైన వివిధ రంగాలను ఆదుకునేందుకు గౌరవ ప్రధాన మంత్రి 20 లక్షల కోట్లతో ఆత్మ నిర్భర్ భారత్ పేరిట సహాయ ప్యాకేజీ ప్రకటించి ఇప్పటికీ ఒక సంవత్సరం పైగా పూర్తయింది. మరోవైపు కరోనా కష్టకాలంలో తెలంగాణలోని సూక్ష్మ మరియు మధ్యతరహా పరిశ్రమలకు ఈ ప్యాకేజీ ద్వారా లబ్ధి చేకూర్చేలా తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రిగా గట్టి ప్రయత్నం చేస్తూ వచ్చాను. అయితే కరోనా సంక్షోభం ద్వారా తీవ్రంగా ప్రభావితమైన తెలంగాణ సూక్ష్మ మరియు మధ్య తరహా పరిశ్రమలకు కేంద్రం ప్రకటించిన ప్యాకేజీలో ఆకర్షణీయ అంశాలు అత్యంత కనిష్టంగా ఉన్నాయని తెలిపేందుకు చింతిస్తున్నాను. రాష్ట్రంలో 80 శాతానికిపైగా ఉన్న ఎంఎస్ఎంఈలు లాక్ డౌన్ నేపథ్యంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి, 25 శాతానికి పైగా ఎంఎస్ఎంఈలు తమ రాబడులను పూర్తిగా కోల్పోయాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here