Home Entertainment సాయిప‌ల్ల‌వి బాలీవుడ్ ఎంట్రీ

సాయిప‌ల్ల‌వి బాలీవుడ్ ఎంట్రీ

60
0

సాయి పల్లవి టాలెంట్ గురించి స్పెషల్ గా ఇంట్రుడ్యూస్ చేయాల్సిన పనిలేదు. ఈ నేచురల్ బ్యూటీ నటనకు అన్ని ఇండస్ట్రీల ప్రేక్షకులూ ఫిదా అవుతున్నారు. ఇక ఈ బ్యూటీ పాదం కదిపితే ఆ లెక్కే వేరు. సహజంగానే డ్యాన్సర్ అయిన సాయి పల్లవి.. సినిమాల్లో వేసే స్టెప్పులకు ఫ్యాన్స్ ఈల వేసి గోల చేస్తుంటారు. తన సహజమైన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుందీ బ్యూటీ.


అయితే.. ఈ అమ్మడు డబ్బే ప్రధానంగా సినిమాలు చేసే రకం కాదు. తన క్యారెక్టర్ నచ్చాలి. సమ్ థింగ్ డిఫరెంట్ అనిపిస్తే తప్ప.. సినిమాకు సైన్ చేయదు. ఆ విధంగా ఇప్పటి వరకు ఎన్నో చిత్రాలు వదిలేసుకుంది. అందులో స్టార్ హీరోల సినిమాలు కూడా ఉన్నాయి. ఆ విధంగా.. సెలక్టివ్ సినిమాలను ఎంచుకునే సాయిపల్లవి.. మెజారిటీగా హిట్లనే తన ఖాతాలో వేసుకుంటోంది.

ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏమంటే.. సాయి పల్లవి టాలెంట్ బాలీవుడ్ ను సైతం ఆకర్షించింది. అక్కడి నుంచి చాలా సినిమా ఆఫర్లు వస్తున్నాయట. లేటెస్ట్ గా ఓ ప్రముఖ బ్యానర్ కూడా ఈ బ్యూటీని కాంటాక్ట్ అయ్యిందని టాక్. బాలీవుడ్ కు వెళ్లడానికి ఈ అమ్మడు కూడా సిద్ధంగానే ఉందని తెలుస్తోంది. అయితే.. ఖచ్చితంగా కథ మాత్రం నచ్చాల్సిందే. అన్నీ ఒకే అయితే.. త్వరలోనే ఈ కేరళ కుట్టి బాలీవుడ్ లో అడుగు పెట్టడం ఖాయమేనట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here