Home Entertainment రేవ్ పార్టీలో రెచ్చిపోయిన జంట‌లు

రేవ్ పార్టీలో రెచ్చిపోయిన జంట‌లు

160
0

డ్తాల్ మండల కేంద్రానికి సమీపంలో ఉన్న బాక్స్ కంటైనర్ ఫాంహౌస్‌లో ఈ రేవ్ పార్టీ జరిగింది. వరుణ్ గౌడ్ అనే వ్యక్తి ఈ పార్టీని ఏర్పాటు చేయగా జీశాన్ అలీ ఖాన్,అన్వేష్ వ్యవహరించారు. మొత్తం 70 మంది వరకు యువతీ యువకులు ఇందులో పాల్గొన్నారు. మద్యం మత్తులో డీజే పాటలతో హెరెత్తించారు. దీనిపై పోలీసులకు సమాచారం అందడంతో అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఫాంహౌస్‌పై దాడి చేశారు. రేవ్ పార్టీని భగ్నం చేసి 21 మంది యువతులు, 43 మంది యువకులను పోలీసులు అరెస్టు చేశారు.

పార్టీ ఏర్పాటు చేసిన వరుణ్… పోలీసుల రాకను గమనించి పరారయ్యాడు. ఈ సందర్భంగా 47 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. కందుకూరు మండలం రాచులూరుకి చెందిన ఫాంహౌస్‌ యజమాని భరత్‌ ఏ-1గా, నిర్వాహకులు మెహిదీపట్నానికి చెందిన జిషాన్‌ అలీఖాన్‌ ఏ-2గా, ఎస్‌ఆర్‌నగర్‌కు చెందిన అన్వేష్‌ ఏ-3గా కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న వరుణ్‌గౌడ్‌పై ఏ-4గా కేసు నమోదు చేశారు. అరెస్టయినవారిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లాక… సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.

ఈ పార్టీలో పాల్గొన్నవారిలో బడా బాబుల పిల్లలు చాలామందే ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. పార్టీలో పాల్గొన్న యువతీ,యువకులు అన్ని హద్దులు మీరిపోయారని… రేవ్‌ పార్టీకి మించిన సీన్ లోపల కనిపించిందని చెబుతున్నారు. నిజానికి ఈ ఫాంహౌస్‌లో గత కొన్నాళ్లుగా గుట్టు చప్పుడు కాకుండా రేవ్ పార్టీలు నిర్వహిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. రెండు నెలల క్రితం హైదరాబాద్ శివారులోని సంస్థాన్ నారాయణపురంలోనూ పోలీసులు ఓ రేవ్ పార్టీని భగ్నం చేసిన సంగతి తెలిసిందే. రేవ్ పార్టీ జరుగుతున్న ఫాంహౌస్‌పై మెరుపు దాడి చేసి 90 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా పెద్దమొత్తంలో మద్యం సీసాలు, కండోమ్ ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. యువతీ యువకులకు సంబంధించి కార్లు, బైకులను సీజ్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here