Home Entertainment యాంక‌ర్ సుమ సంపాద‌న ఎంతో తెలుసా..?

యాంక‌ర్ సుమ సంపాద‌న ఎంతో తెలుసా..?

185
0

తెలుగు ఇండస్ట్రీలో యాంకర్ సుమకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు ఇండస్ట్రీలోనే హీరోయిన్లు కూడా కుళ్లుకునే రేంజ్‌లో సంపాదిస్తుంది.. వాళ్ల కంటే ఎక్కువగా ఇమేజ్ తెచ్చుకుంది సుమ. వయసు 50కి చేరువ అవుతున్నా కూడా ఇప్పటికీ అదే స్టార్ డమ్ కంటిన్యూ చేస్తుంది.

యాంకర్స్‌కు కలలో కూడా ఊహించనంత ఇమేజ్ తీసుకొచ్చింది ఈమె. సుమకు తెలుగులో మాత్రమే కాదు అంతర్జాతీయంగా కూడా అభిమానులు ఉన్నారు. దేశ విదేశాల్లో కూడా సుమ అంటే క్రేజ్ ఉంది. తెలుగు బుల్లితెరని మకుటం లేని మహారాణిగా ఏలేస్తుంది యాంకర్ సుమ కనకాల.

తనకు పోటీగా రావాలనే ఆలోచన కూడా మరే యాంకర్‌కు రానీకుండా దూసుకుపోతుంది. ఇండస్ట్రీకి వచ్చి పాతికేళ్లు దాటినా.. యాంకర్‌గా అగ్రస్థానం చేరి పదేళ్లు దాటిపోయింది. అప్పట్నుంచి ఇప్పటి వరకు ఎంతోమంది యాంకర్స్ తన కళ్ల ముందే వస్తున్నారు వెళ్తున్నారు కానీ సుమ మాత్రం అలాగే ఉండిపోయింది.

ప్రతి ఇంట్లోనూ తమ మనిషిలా కలిసిపోయిన సుమను దాటడం అంటే చిన్న విషయం కాదు.. అది కలలో మాటే. అలాంటి రోజు వస్తుందని కూడా ఎవరూ అనుకోవడం లేదు. సుమ తనకు తానుగా రిటైర్ అయితే తప్ప టాప్ యాంకర్ స్థానం మరొకరికి వెళ్లదంటే అతిశయోక్తి కాదేమో..?

అలాంటి సుమకు పోటీ వచ్చే ధైర్యం ఏ యాంకర్ చేయదు. ఇదిలా ఉంటే కొన్ని నెలలుగా కరోనా నేపథ్యంలో ముందులా సినిమా వాళ్లకు పని దొరకడం లేదు. వాళ్ల గురించి సుమ కూడా చాలా బాధ పడుతుంది. తనకు తోచిన సాయం కూడా చేస్తుంది.

అప్పుడప్పుడూ సినిమా కార్మికుల కోసం ఆర్థిక సాయం కూడా చేస్తుంది సుమ కనకాల. ఇదంతా ఇలా ఉంటే ఈమె సంపాదన విషయంలో మాత్రం సోషల్ మీడియాలో చాలా వార్తలే వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఏ కార్యక్రమం లేకపోయినా కూడా సుమ మాత్రం బాగానే సంపాదిస్తుంది.

షూటింగ్స్ ఉన్నా లేకపోయినా ఈమె సంపాదనకు ఢోకా లేదు. ఎందుకంటే ఇంట్లో ఉంటూనే సంపాదించడం మొదలు పెట్టింది ఈ టాప్ యాంకర్. కొన్ని వంటల ప్రోగ్రామ్స్‌తో పాటు వాళ్లు సిద్ధం చేసే ప్రాడక్ట్స్‌కు కూడా సుమ బ్రాండింగ్ చేస్తుంది.

తన ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలను కూడా షేర్ చేస్తుంది. మొన్నీమధ్యే ఇడ్లీ దినోత్సవం అంటూ ఓ వీడియోను పోస్ట్ చేసింది సుమ. ఓ కంపెనీ వాళ్లు చేసిన స్పెషల్ ప్రొడక్ట్‌లను ప్రమోట్ చేసింది సుమ. పుట్నాల పొడి, కారం పొడి తనకు ఎంతో ఇష్టమైన చల్ల మిరపకాయలు ఈ కంపెనీ తయారు చేసే ప్రాడక్ట్స్‌లలో ఉన్నాయని తెలిపింది సుమ. ఏదేమైనా కూడా లాక్‌డౌన్ సమయంలోనూ ఇంట్లోనే ఉండి సంపాదించడం మొదలు పెట్టారు ఈ టాప్ యాంకర్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here